News June 14, 2024
సిద్దిపేట: మహిళపై దాడి చేసి పుస్తెలతాడు చోరీ.. ఇద్దరి అరెస్ట్

ములుగు మండలం తునికి బొల్లారం వాసి శ్యామల శంకరమ్మ దాడి చేసి 4.50 తులాల బంగారు పుస్తెలతాడు అపహరించిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మేడ్చల్ జిల్లా నాగలూరుకి చెందిన లింగని రజినీకాంత్(23), ఈరగల్ల యాదగిరి(36)గా గుర్తించినట్లు సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. శంకరమ్మ ఈనెల 11న ఉదయం వాకింగ్ చేస్తుండగా దాడి చేసి పుస్తెలతాడు ఎత్తుకెళ్లారు. తూప్రాన్‌లో అమ్ముతుండగా ఇద్దర్ని పోలీసులు పట్టుకున్నారు.
Similar News
News March 10, 2026
మెదక్: మహిళ మృతదేహం కలకలం

పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. మంగళవారం ఏడుపాయల వెళ్లే రహదారిలోని చెల్మికుంట అడవి ప్రాంతంలో గుర్తుతెలియని మహిళా మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
News March 10, 2026
సంక్షేమ శాఖ పనితీరు ఆదర్శనీయం: ఐసీడీఎస్ డైరెక్టర్

మెదక్ జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ శాఖ పనితీరు ఆదర్శంగా ఉందని ఐసీడీఎస్ డైరెక్టర్ శృతి ఓజా ప్రశంసించారు. సోమవారం ఆమె మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రతిమ సింగ్‌తో భేటీ అయ్యారు. అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, జిల్లాలోని కేంద్రాలు, సఖి సెంటర్లలో బాధితులకు, చిన్నారులకు మెరుగైన సేవలు అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.