News June 14, 2024
కంగ్రాట్స్.. పవన్ కళ్యాణ్: సీఎం చంద్రబాబు

AP: డిప్యూటీ సీఎంగా నియమితులైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు నాయుడు కంగ్రాట్స్ చెప్పారు. ‘మంత్రివర్గంలో వివిధ శాఖలు పొందిన నా సహచరులందరికీ అభినందనలు. అందరం రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తామని, ప్రజా పాలనకు నాంది పలుకుతామని ప్రతిజ్ఞ చేశాం. మంత్రులుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మీరు కృషి చేస్తారనే నమ్మకం నాకుంది. నూతన ప్రయాణంలో మరోసారి అందరికీ శుభాకాంక్షలు’ అని సీఎం ట్వీట్ చేశారు.
Similar News
News January 28, 2026
వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీలో ఉద్యోగాలు

<
News January 28, 2026
చివరి కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు

మహారాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన అజిత్ పవార్‌కు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ నెరవేరలేదు. ‘సీఎం కావాలనుకుంటున్నాను’ అని ఆయన పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారు. ఎన్నో రాజకీయ ఎత్తుగడలు వేసినా సీఎం కుర్చీ మాత్రం అజిత్ దాదాకు అందని ద్రాక్షగానే మిగిలింది. అయితే మహారాష్ట్ర చరిత్రలో అత్యధిక కాలం డిప్యూటీ సీఎంగా పనిచేసిన నేతగా <<18980541>>రికార్డు<<>> సృష్టించారు.
News January 28, 2026
రొమ్ముల్లో గడ్డలున్నాయా?

సాధారణంగా రొమ్ములో ఏవైనా గడ్డలుంటే చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్ అని భయపడతారు. కానీ రొమ్ములో కొన్నిసార్లు అపాయంలేని గడ్డలు ఏర్పడతాయంటున్నారు నిపుణులు. దీన్నే ఫైబ్రోఎడినోమా అంటారు. వీటివల్ల ప్రాణాపాయం ఉండదు కానీ రొమ్ములో ఏదైనా అసాధారణంగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. 15-30 ఏళ్ల మధ్యలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. వీటి సైజ్ బాగా ఎక్కువగా ఉంటే ఆపరేషన్ చెయ్యాల్సుంటుంది.


