News June 14, 2024

మరోసారి ట్రెండింగ్‌లోకి ‘MELODI’

image

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీ7 సమ్మిట్ కోసం ఇటలీ వెళ్లిన నేపథ్యంలో మరోసారి ‘MELODI’ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. గతేడాది డిసెంబర్‌లో మోదీతో సెల్ఫీని షేర్ చేసిన ఇటలీ ప్రధాని మెలోని ‘గుడ్ ఫ్రెండ్స్ #MELODI’ అని క్యాప్షన్ ఇచ్చారు. అప్పటి నుంచి వీరి ఫొటోలతో ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం G7లోని 4దేశాలకు మించిన ఎకానమీ భారత్ సాధించడంతో మోదీని మెలోని ప్రత్యేకంగా <<13433417>>ఆహ్వానించారు.<<>>

Similar News

News July 4, 2025

సెప్టెంబర్‌లో స్కిల్ పోర్టల్ ప్రారంభం: మంత్రి లోకేశ్

image

AP: స్కిల్ పోర్టల్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించారు. ‘ఉద్యోగ, ఉపాధి కల్పనకు మిషన్ మోడ్ విధానంలో స్కిల్ పోర్టల్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తాం. 90 రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఆటోమేటిక్‌గా రెజ్యూమ్ రెడీ అవుతుంది’ అని Xలో పోస్ట్ చేశారు.

News July 4, 2025

కాసేపట్లో మోస్తరు నుంచి భారీ వర్షం: వాతావరణ కేంద్రం

image

TG: కాసేపట్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. హైదరాబాద్ నగరంలో రాత్రి 9 గంటల తర్వాత అరగంట పాటు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఆదిలాబాద్, గద్వాల, ఆసిఫాబాద్, MBNR, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి వర్షం వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

News July 4, 2025

IIIT విద్యార్థుల జాబితా విడుదల

image

TG: 2025-26 విద్యా సంవత్సరానికి IIITలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను ఇన్‌ఛార్జ్ వీసీ విడుదల చేశారు. 20,258 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా తొలి విడతలో 1,690 మందిని ఎంపిక చేశారు. విద్యార్థులకు టెన్త్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఎంపిక జరగ్గా, 88శాతం సీట్లు ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వారికే దక్కాయి. ఎంపికైన విద్యార్థులకు జులై 7, 8, 9 తేదీల్లో యూనివర్సిటీ క్యాంపస్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. <>లింక్<<>> ఇదే.