News June 14, 2024

బడ్జెట్‌లో ఫేమ్-3పై ప్రకటన?

image

FAME-3 స్కీమ్ అమలుపై త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్‌కు రూ.10వేల కోట్లు కేటాయించొచ్చనేది విశ్లేషకుల అంచనా. ఈవీలను ప్రోత్సహించేందుకు గతంలో తెచ్చిన ఈ స్కీమ్‌ను మరోసారి అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2015లో రూ.5,172కోట్లతో ఫేమ్ స్కీమ్ లాంచ్ చేయగా, 2019లో FAME-2 కోసం రూ.10వేల కోట్లు కేటాయించింది. ఈ ఏడాది మార్చి 31 వరకు ఫేమ్-2 కొనసాగింది.

Similar News

News December 26, 2024

మంత్రులు, అధికారులతో సీఎం సమావేశం

image

సినీ ప్రముఖులతో భేటీకి ముందు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో సమావేశం అయ్యారు. సినీ పరిశ్రమ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆలోచనలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం పోలీస్ కమాండ్ సెంటర్ (CCC)లో నిర్మాతలు, దర్శకులు, నటులతో సీఎం భేటీ కానున్నారు.

News December 26, 2024

బాక్సింగ్ డే: ముగ్గురు బ్యాటర్లు అర్ధసెంచరీలు

image

టీమ్ ఇండియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఓపెనర్లు కోన్ట్సస్(60), ఖవాజా(57) అర్ధసెంచరీలతో రాణించారు. టీ విరామం తర్వాత లబుషేన్(61*) కూడా అర్ధసెంచరీ పూర్తి చేశారు. మరో బ్యాటర్ స్మిత్(30*) క్రీజులో ఉన్నారు. బుమ్రా, జడేజా చెరో వికెట్ తీశారు.

News December 26, 2024

మాజీ ఎంపీ మంద జగన్నాథం ఆరోగ్యం విషమం

image

TG: నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ, సీనియర్ నేత మంద జగన్నాథం ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొన్ని రోజుల క్రితం గుండె పోటుకు గురవ్వగా నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురు నాయకులు ఆయనను పరామర్శించారు.