News June 14, 2024

ఫ్లోరిడాలో వర్షం.. టాస్ ఆలస్యం

image

టీ20 వరల్డ్ కప్‌లో అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్‌కు వరుణుడి అంతరాయం ఏర్పడింది. ఫ్లోరిడాలో భారీ వర్షం పడటంతో ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్త‌డిగా మారింది. దీంతో టాస్ ఆలస్యమవుతోంది. ఒకవేళ వర్షంతో ఈ మ్యాచ్ రద్దయితే ఇరుజ‌ట్ల‌కు చెరొక పాయింట్ ఇస్తారు. అప్పుడు 5 పాయింట్లతో అమెరికా సూప‌ర్-8కు వెళ్తుంది. త‌ర్వాతి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై పాకిస్థాన్ గెలిచినా నాలుగు పాయింట్లతో ఆ జట్టు ఇంటి బాట పడుతుంది.

Similar News

News December 26, 2024

బెనిఫిట్ షోలు ఉండవు: సీఎం రేవంత్ రెడ్డి

image

సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బెనిఫిట్ షోల విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పినదానికే కట్టుబడి ఉంటామని, బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం తేల్చి చెప్పారు.

News December 26, 2024

సీఎంతో భేటీకి మెగాస్టార్ చిరంజీవి దూరం

image

TG: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీకి చిరంజీవి హాజరుకాలేదు. సినీ పెద్దలంతా కలిసి వస్తారని భావించినా సీనియర్ హీరోల్లో కేవలం నాగార్జున, వెంకటేశ్ మాత్రమే కనిపించారు. చెన్నైలో స్నేహితుడి కూతురి పెళ్లికి వెళ్లడం వల్లే ఈ భేటీకి దూరంగా ఉన్నట్లు చిరు టీం తెలిపింది. హీరోల్లో వరుణ్ తేజ్, శివ బాలాజీ, కళ్యాణ్ రామ్, అడివి శేష్, కిరణ్ అబ్బవరం, రామ్, సిద్ధూ జొన్నలగడ్డ, నితిన్, సాయిధరమ్ తేజ్ వచ్చారు.

News December 26, 2024

సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

image

TG: సీఎం రేవంత్ రెడ్డితో దిల్ రాజు నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం సమావేశమైంది. ఇటీవల జరిగిన పరిణామాలు, టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఇతర అంశాలపై వీరు చర్చించనున్నట్లు తెలుస్తోంది.