News June 14, 2024

ప్రభాస్ ‘కల్కి’ మూవీ నుంచి UPDATE

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ నుంచి రేపు ఫస్ట్ సింగిల్ ప్రొమో విడుదల కానుంది. ‘దేశంలోనే మోస్ట్ సెలబ్రేటెడ్ నటుడి కోసం మోస్ట్ సెలబ్రేటెడ్ సింగర్’ అంటూ పాటపై అంచనాలను పెంచేసింది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్, రాజేంద్రప్రసాద్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 27న మూవీ విడుదల కానుంది.

Similar News

News November 1, 2025

ఎల్లుండి నుంచి ధాన్యం కొనుగోళ్లు.. 48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు

image

AP: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లను ఎల్లుండి నుంచి ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇందుకోసం 3,013 RSKలు, 2,061 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ‘ఈసారి 51L టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులు 7337359375 వాట్సాప్ నంబర్‌కు HI అని మెసేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొనుగోలు చేసిన 24-48 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం’ అని పేర్కొన్నారు.

News November 1, 2025

పోలవరం నిర్వాసితులకు రూ 1000 కోట్లు పంపిణీ

image

AP: పోలవరం భూ నిర్వాసితులకు రూ.1000 కోట్లు పంపిణీ చేశారు. ఈ మేరకు నిర్వాసితుల అకౌంట్లలో నగదు జమ చేసినట్లు మంత్రి రామనాయుడు వెల్లడించారు. ఏలూరులోని వేలేరుపాడులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అందరికీ అండగా నిలుస్తుందన్నారు. భూసేకరణ, పరిహారం చెల్లింపుల్లో దళారుల మాట నమ్మొద్దని సూచించారు. 2027కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు.

News November 1, 2025

ఢిల్లీకి సంజూ.. రాజస్థాన్‌కు స్టబ్స్?

image

IPL వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక స్వాప్ డీల్ పూర్తయినట్లు సమాచారం. RR కెప్టెన్ సంజూ శాంసన్, DC ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్ జట్లు మారడం ఖాయమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని IPL వర్గాలు చెబుతున్నాయి. KL రాహుల్ పేరు కూడా చర్చల్లోకి వచ్చినప్పటికీ ఆయనను వదులుకోవడానికి ఢిల్లీ సుముఖత చూపలేదు. 2026 సీజన్‌కు సంజూను కెప్టెన్ చేయాలని DC భావిస్తోంది.