News June 14, 2024

థాంక్యూ చంద్రబాబు గారు: పవన్ కళ్యాణ్

image

AP: తనకు కంగ్రాట్స్ చెబుతూ సీఎం చంద్రబాబు నాయుడు <<13439772>>చేసిన<<>> ట్వీట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘సీఎం గారూ.. మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మీతో కలిసి పనిచేసే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నా. ఎన్డీయే నాయకత్వ సూచనలతో మంత్రుల సమష్టి కృషితో సమాజంలోని అన్ని వర్గాల పురోగతికి పాటుపడతాం. సుసంపన్న ఆంధ్రప్రదేశ్ కోసం మీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 26, 2024

హైదరాబాద్ ప్రపంచ సినీ రాజధాని కావాలి: నాగార్జున

image

TG: ఈరోజు రేవంత్‌తో జరిగిన భేటీలో సినీ పెద్దలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తేనే సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలి’ అని నాగార్జున అన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలని రాఘవేంద్రరావు పేర్కొన్నారు. మరోవైపు సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఎన్నికల ఫలితాల్లాగే ఉత్కంఠగా ఉంటుందని మురళీమోహన్ తెలిపారు.

News December 26, 2024

సినీ పెద్దలకు సీఎం రేవంత్ షాక్

image

TG: మూవీ ఇండస్ట్రీకి కీలకమైన బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపుపై సినీ ప్రముఖులకు నిరాశే ఎదురైంది. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. CM నిర్ణయం పట్ల ఇండస్ట్రీ పెద్దలు నిరాశ చెందినట్లు సమాచారం. రూ.వందల కోట్లతో తెరకెక్కిన సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు లేకపోవడం పెద్ద దెబ్బేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News December 26, 2024

వ్యక్తుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టలేం: సీఎం

image

TG: తనకు వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టలేమన్నారు. తనకు ప్రత్యేకంగా ఎలాంటి రాగద్వేషాలు లేవని చెప్పారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రభుత్వం సహకరిస్తుందని, అదే సమయంలో ప్రభుత్వానికి సినీ పరిశ్రమ సహకరించాలని కోరారు. చిత్ర పరిశ్రమ రాజకీయాలను దూరం పెట్టాలని సూచించారు.