News June 14, 2024
అన్ని లెక్కలు బయటకు తీస్తాం.. పేదలకు న్యాయం చేస్తాం: పరిటాల సునీత
గత ఐదేళ్లలో పేదల ఇళ్ల మాటున కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి చేసిన అవినీతి లెక్కలను బయటకు తీస్తామని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం ఆమె క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్, గృహ నిర్మాణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీ రాజ్ అధికారులతో సమావేశమై నియోజకవర్గంలో నిధులు ఉండి పనులు చేయని రోడ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News January 15, 2025
ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ని కలిసిన కలెక్టర్
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి శాంతిభవనంలో ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ కలిశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎస్పీ రత్న, ఆర్డిఓ సువర్ణ, తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అలాగే జిల్లాలో తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
News January 14, 2025
ధర్మవరం లాడ్జిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ సూసైడ్
ధర్మవరంలోని పీఆర్టీ సర్కిల్ వద్ద గల కృష్ణ లాడ్జిలో శివరాఘవ రెడ్డి(22) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అద్దెకు తీసుకున్న రూమ్‌లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. శివరాఘవ రెడ్డి నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయి పల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.
News January 14, 2025
లండన్ పర్యటనలో భద్రతకు అనంతపురం కమాండర్ కావాలి: జగన్
YS జగన్ కుటుంబంతో కలిసి లండన్ వెళ్లనున్నారు. ఈనెల 16న జరగనున్న కుమార్తె స్నాతకోత్సవానికి వెళ్లడానికి కోర్టును అనుమతి కోరారు. అయితే లండన్‌లో తనకు సెక్యురిటీగా అనంతపురం APSP బెటాలియన్‌కు చెందిన కమాండెంట్ మహబూబ్‌ను నియమించేలా ఆదేశాలివ్వాలని సోమవారం అత్యవసర హౌస్‌మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపుతోంది. కాగా తమ వినతిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని అధికారులను YS జగన్ కోరారు.