News June 14, 2024

రన్స్ 0, వికెట్లు 0, క్యాచ్‌లు 0

image

T20WCలో సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇప్పటి వరకు 3 మ్యాచులు ఆడగా అతడి గణాంకాలు(రన్స్ 0, వికెట్లు 0, క్యాచ్‌లు 0) పేలవంగా ఉన్నాయి. ఒక మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వచ్చి డకౌట్ అయ్యారు. గత మ్యాచ్‌లో బౌలింగే వేయలేదు. దీంతో అతడి స్థానంలో జైస్వాల్‌ను తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. అతడు మంచి ఓపెనింగ్ ఇస్తారని, కోహ్లీని వన్‌డౌన్‌లో దించాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Similar News

News January 1, 2026

భారత్ అందరిదీ.. RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు

image

డెహ్రాడూన్‌లో త్రిపుర విద్యార్థిపై జరిగిన జాతివివక్ష దాడి నేపథ్యంలో RSS చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారతదేశం అందరిది. కులమతాలు, భాష, ప్రాంతం ఆధారంగా ఎవరినీ తక్కువ చేయొద్దు’ అని ఆయన పిలుపునిచ్చారు. విభజన భావాలను వీడి సమానత్వంతో మెలగాలని ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన సభలో సూచించారు. దాడిలో చనిపోయిన విద్యార్థి ఏంజల్ చక్మా మృతి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ సామాజిక సామరస్యం అవసరమని గుర్తుచేశారు.

News January 1, 2026

అనుకున్న సమయానికి అమరావతి పూర్తి చేస్తాం: నారాయణ

image

AP: అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అనుకున్న సమయానికే రాజధానిని పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. మూడేళ్లలో పూర్తిస్థాయిలో అమరావతి రూపుదిద్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే CM చంద్రబాబు అనేక పెట్టుబడులను తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

News January 1, 2026

గుండెలు పగిలే బాధ.. ఈ తల్లి శోకాన్ని తీర్చేదెవరు?

image

ఇండోర్ (MP)లో <<18729199>>కలుషిత నీరు<<>> తాగి చనిపోయిన వారిలో 6 నెలల పసికందు కూడా ఉండటం హృదయాలను కలచివేస్తోంది. తల్లి సాధన మున్సిపల్ కుళాయి నీటిని పాలలో కలిపి బిడ్డకు తాగించింది. వాంతులు చేసుకున్న కుమారుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పదేళ్ల ప్రార్థనల తర్వాత సంతానం కలిగిందని, పెద్ద కూతురు (10) కడుపునొప్పితో బాధపడుతోందని ఆ తల్లి గుండెలు బాదుకుంది.