News June 14, 2024

TTD ఈవోగా ధర్మారెడ్డి తొలగింపు

image

AP: టీటీడీ ఈవో ధర్మారెడ్డిని బాధ్యతల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో జె.శ్యామలరావుని నియమించింది. ఈయన ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఇటీవల ధర్మారెడ్డిని సెలవుపై పంపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలను ధర్మారెడ్డి ఎదుర్కొంటున్నారు.

Similar News

News October 31, 2025

అండాశయ క్యాన్సర్‌కు కారణాలివే..

image

ఒవేరియన్ క్యాన్సర్‌కి నిర్దిష్టమైన లక్షణాలు లేకపోవడం వల్ల చివరి దశ వరకూ దీన్ని గుర్తించడం కష్టం. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్‌గా పరిగణిస్తారు నిపుణులు. విడుదలయ్యే అండాల సంఖ్య తగ్గితే అండాశయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం తక్కువని చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్ ఉన్నా, కుటుంబంలో ఎవరికైనా ఉన్నా, పిల్లలు లేకపోయినా, ఆలస్యంగా మెనోపాజ్ వచ్చినా, హార్మోన్ చికిత్స తీసుకున్నా దీని ముప్పు పెరుగుతుంది.

News October 31, 2025

అండాశయ క్యాన్సర్ లక్షణాలు

image

చాలామంది మహిళలు మెనోపాజ్ లక్షణాలను విస్మరిస్తుంటారు. అండాశయ క్యాన్సర్‌కూ కొన్నిసార్లు ఇవే లక్షణాలుంటాయంటున్నారు నిపుణులు. పొత్తికడుపు ఉబ్బరం, బరువు తగ్గడం, కటి ప్రాంతంలో అసౌకర్యం, అలసట, వెన్నునొప్పి, జీర్ణక్రియలో ఇబ్బంది, సెక్స్ సమయంలో నొప్పి వంటి లక్షణాలుంటాయి. కాబట్టి ఏవైనా అసాధారణ లక్షణాలు, మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

News October 31, 2025

దేశంలో పెరిగిన ఫేక్ రూ.500 నోట్లు

image

₹2,000 నోట్లను ఉపసంహరించుకున్న తర్వాత ₹500 ఫేక్ నోట్లు పెరిగాయని కేంద్ర ఆర్థికశాఖ డేటాలో వెల్లడైంది. FY23లో 91,110, FY24లో 85,711 ఫేక్ నోట్లను గుర్తించగా, FY25లో ఆ సంఖ్య 1,17,722కు పెరిగింది. ₹2వేల నోట్లు చెలామణిలో ఉన్నప్పుడు, ఉపసంహరణ సమయంలో ఆ నకిలీ కరెన్సీనే ఎక్కువగా ఉండేది. FY23లో 9,806, FY24లో 26,035, FY25లో 3,508 దొంగ నోట్లు ఉండేవి. ₹2వేల నోట్లు రద్దవగానే ₹500 నోట్ల నకిలీ కరెన్సీ పెరిగింది.