News June 14, 2024
పెండింగ్ ధరణి సమస్యలను పరిష్కరించాలి: నవీన్ మిట్టల్

పెండింగ్ ధరణి సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించి పరిష్కరించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ప్రతి మండలంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి భవనం లేదా భూమి కేటాయించి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 25, 2026
KNR: ఎస్సారెస్పీ కాలువలో రైతు గల్లంతు

శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన యువరైతు సదుల అనిల్ ఎస్సారెస్పీ కాలువలో గల్లంతయ్యాడు. పొలం పనుల అనంతరం కాలువలో బురద బట్టలు శుభ్రపరుస్తుండగా ప్రమాదవశాత్తు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, ఎస్సారెస్పీ అధికారుల సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 25, 2026
పోలీసుల విధుల్లో నైపుణ్యం అవసరం: సీపీ గౌష్ ఆలం

కరీంనగర్ పోలీస్ పరేడ్ మైదానంలో ఆదివారం వార్షిక డీ-మొబిలైజేషన్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ గౌష్ ఆలం సిబ్బంది వందనాన్ని స్వీకరించారు. శిక్షణతోనే వృత్తిపరమైన నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఆయన తెలిపారు. నెల రోజులుగా ఆయుధాల వినియోగం, భద్రతా నియమాలు, ఫైరింగ్‌పై శిక్షణ ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు వెంకటరమణ, భీంరావు తదితరులు పాల్గొన్నారు.
News January 25, 2026
‘కరీంనగర్ కలెక్టర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు’

ఎన్నికల నిర్వహణలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఆమె రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు. ఓటర్ల అవగాహన, సిబ్బందికి శిక్షణ, పారదర్శక ఎన్నికల ప్రక్రియలో చూపిన వినూత్న కృషికి ఈ గౌరవం దక్కింది. ఈ విజయం జిల్లా యంత్రాంగం సమష్టి కృషి అని కలెక్టర్ పేర్కొన్నారు.


