News June 14, 2024

పవన్ కళ్యాణ్: మినిస్టర్ కమ్ యాక్టర్ పాత్ర పోషిస్తారా?

image

AP: ప్రభుత్వంలో జనసేన భాగస్వామి అయింది. పవన్ కళ్యాణ్‌కు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధితోపాటు మరో 3మంత్రిత్వ శాఖలు దక్కాయి. ప్రజాప్రతినిధిగా ఆయన బాధ్యత మరింత పెరిగింది. దీంతో ఆయన సినిమాలకు దూరమవుతారా? అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం పవన్ చేతిలో ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్, హరిహర వీరమల్లు చిత్రాలున్నాయి. వీటి తర్వాత పవన్ వెండితెరపై సందడి చేస్తారా? లేదా ప్రజాక్షేత్రంలోనే సేవలందిస్తారా? అనేది చూడాలి.

Similar News

News September 13, 2025

ALERT: ITR ఫైల్ చేయడం లేదా?

image

2024-25FYకి సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్(ITR) ఫైల్ చేయడానికి మరో 2 రోజులే గడువు ఉంది. కేంద్రం రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇచ్చిందని చాలామంది ఫైల్ చేయడం లేదు. కానీ ఈ నిర్ణయం 2025-26 నుంచి అమల్లోకి రానుంది. 2024-25లో ఆదాయం రూ.3 లక్షలు దాటినవారు కూడా ఇప్పుడు ITR ఫైల్ చేయాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. SEP 15 డెడ్‌లైన్ దాటితే రూ.5వేల వరకు పెనాల్టీ పడుతుందని హెచ్చరిస్తున్నారు.

News September 13, 2025

రెచ్చగొట్టే వారి ఉచ్చులో పడొద్దు: పవన్ కళ్యాణ్

image

AP: తనపై దుష్ప్రచారం చేసేవారిని ప్రజాస్వామ్యయుతంగా, చట్టప్రకారమే తిప్పికొట్టాలని జనసైనికులకు Dy.CM పవన్ కళ్యాణ్ సూచించారు. ఘర్షణ పడడం ద్వారా సమస్య మరింత జటిలమవుతుందని పేర్కొన్నారు. ‘పదేళ్లుగా మనపై కుట్రలు చేస్తున్నవారిని చూస్తూనే ఉన్నాం. అలాంటివారి ఉచ్చులో పడొద్దు. ఎవరూ ఆవేశానికి గురై గొడవలకు దిగవద్దు. కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించేవారిని చట్టం ముందు నిలబెట్టాలి’ అంటూ దిశానిర్దేశం చేశారు.

News September 13, 2025

రాజధానిపై సజ్జల కామెంట్స్ వైరల్.. మీరేమంటారు?

image

AP: తాము గెలిస్తే గుంటూరు-విజయవాడ మధ్య <<17688305>>రాజధాని<<>> ఏర్పాటు చేస్తామన్న సజ్జల వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎన్నిసార్లు మాట మారుస్తారని TDP శ్రేణులు విమర్శిస్తున్నాయి. 2014లో జగన్ అమరావతిని రాజధానిగా అంగీకరించారని, 2019లో గెలిచాక 3 రాజధానులు అన్నారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ మాట మార్చారని, ఇది దేనికి సంకేతం అని ప్రశ్నిస్తున్నారు. మరి రాజధానిపై సజ్జల వ్యాఖ్యలపై మీ కామెంట్?