News June 14, 2024

కుటుంబ సభ్యులతో చంద్రబాబును కలిసిన అనిత

image

సీఎం చంద్రబాబును అమరావతి సచివాలయంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. హోమ్ మినిస్టర్‌గా బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తానన్నారు. నమ్మకం నిలబెట్టుకుంటానని చంద్రబాబుకు ఈ సందర్బంగా తెలిపారు.

Similar News

News October 2, 2024

విశాఖ: హైకోర్టు ఆదేశాలతో రేషన్ డిపోల పునర్విభజనకు బ్రేక్

image

విశాఖ జిల్లాలో రేషన్ డిపోల పునర్విభజనకు హైకోర్టు ఆదేశాలతో బ్రేక్ పడింది. జిల్లాలో రేషన్ షాపుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జీవోను రద్దు చేయాలని రేషన్ డీలర్లు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు విశాఖ జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు పద్మనాభం తెలిపారు.

News October 2, 2024

విశాఖ జిల్లాలో 1,58,224 మందికి పెన్షన్ పంపిణీ

image

విశాఖ జిల్లాలో మంగళవారం సాయంత్రం వరకు 97.39 శాతం పెన్షన్ లబ్ధిదారులకు అందజేసినట్లు డీఆర్డీఏ అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు 1,58,244 మందికి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా సెలవు కావడంతో 3వ తేదీన మిగిలిన లబ్ధిదారులకు పెన్షన్ నగదును పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.

News October 1, 2024

తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసుకుంటాం: స్టీల్ ప్లాంట్ అధికారులు

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ED ఆఫీస్ దగ్గర కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న ధర్నాకి యాజమాన్యం దిగొచ్చింది. తొలగించిన 4290 మంది కాంట్రాక్ట్ కార్మికులకు బయోమెట్రిక్ గేట్ పాసులు యథావిధిగా కొనసాగిస్తామని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మంగళవారం రాత్రి హామి ఇచ్చింది. లిఖిత పూర్వకంగా తమకు హామీ ఇచ్చినట్లు యూనియన్ నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులు వెల్లడించారు.