News June 15, 2024
TODAY HEADLINES
➢ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు
➢AP: ప్రతి సోమవారం పోలవరంపై సమీక్షిస్తా: CBN
➢ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియామకం
➢AP:నా వయసు చిన్నదే.. మళ్లీ అధికారంలోకి వస్తాం: YS జగన్
➢TG:బాలికపై అత్యాచారం, వ్యక్తిని కొట్టి చంపిన ఘటనలపై సీఎం రేవంత్ సీరియస్
➢ధరణి పోర్టల్‌ను ప్రక్షాళన చేస్తున్నాం: పొంగులేటి
➢డ్యుయల్ సిమ్‌లపై ఛార్జీలు వేయట్లేదు: TRAI
Similar News
News January 16, 2025
కోర్టుల్లో వారికి ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేయాలి: SC
దేశంలోని అన్ని కోర్టులు, ట్రిబ్యునల్స్‌లో ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులు, స్త్రీలు, పురుషుల కోసం వేర్వేరు టాయిలెట్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు(SC) ఆదేశించింది. ఇది సౌకర్యానికి సంబంధించినది కాదని కనీస అవసరమని పేర్కొంది. వీటి ఏర్పాటు బాధ్యత ప్రభుత్వం, స్థానిక అధికారులదని తెలిపింది. కోర్టు ఆవరణల్లో సామాన్యులకు టాయిలెట్లు ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
News January 16, 2025
నేడు ఈడీ విచారణకు కేటీఆర్
TG: ఫార్ములా-ఈ కారు రేసులో మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఉ.10.30 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ నెల 7నే విచారణకు హాజరుకావాల్సి ఉండగా క్వాష్ పిటిషన్ విచారణ నేపథ్యంలో గడువు కోరడంతో నేడు రావాలని నోటిసులిచ్చింది. ఇప్పటికే ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది. దీంతో ఇవాళ జరిగే పరిణామాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
News January 16, 2025
ఖో ఖో వరల్డ్ కప్: క్వార్టర్ ఫైనల్‌కు భారత్
ఖో ఖో వరల్డ్ కప్‌లో భారత పురుషుల జట్టు వరుసగా 3 మ్యాచుల్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరింది. నిన్న పెరూతో జరిగిన మ్యాచులో 70-38 తేడాతో గెలుపొందింది. మ్యాచ్ మొత్తం ప్రత్యర్థిపై ఆధిపత్యం కొనసాగించింది. మరోవైపు మహిళల జట్టు ఇరాన్‌పై ఘన విజయం సాధించింది. 100-16 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇవాళ పురుషుల జట్టు భూటాన్‌తో, మహిళల జట్టు మలేషియాతో పోటీ పడనున్నాయి.