News June 15, 2024
ఏలూరు: మసీదుల వద్ద కట్టదిట్టమైన బందోబస్తు: SP
ఏలూరు ఈ నెల 17వ తేదీన బక్రీద్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఎస్పీ మేరీ ప్రశాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన మసీదులు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించారు. మతపెద్దలతో సమావేశమై మత సామరస్యాన్ని కాపాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలన్నారు. పోలీసు అధికారులు ముస్లిం పెద్దలతో సమావేశాలు ఏర్పాటుచేసి అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News November 28, 2024
ఓ రూముకు నా పేరు పెట్టి బెదిరిస్తున్నారు: RRR
తనను వేధించిన వాళ్లంతా జైలుకు వెళ్లడం వాళ్లు చేసుకున్న కర్మేనని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు(RRR) పేర్కొన్నారు. ‘ముసుగు వేసుకుని మరీ నన్ను కొట్టారు. ఆరోజు నా ఛాతీపై బరువైన వ్యక్తి కూర్చోవడంతో మంచం కోళ్లు కూడా విరిగిపోయాయి. నన్ను ఏ రూములో అయితే కొట్టారో దానికి RRR పేరు పెట్టారు. ఆ తర్వాత ఆ రూములోకి ఎంతోమందిని తీసుకెళ్లి బెదిరించి దందాలు చేశారు’ అని RRR చెప్పారు.
News November 28, 2024
ఏలూరు: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం
ఏలూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఎస్ఐ శివాజీ వివరాల ప్రకారం.. దెందులూరు మండలంలోని ఓ గ్రామంలో భార్యాభర్తలు అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంటి ఓనర్ కుమారుడు 9వ తరగతి చదువుతున్నాడు. అతను అద్దెకు దిగిన వారి నాలుగేళ్ల కుమార్తెపై నవంబర్ 25న అత్యాచారం చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని జువైనల్ హోంకు తరలించారు.
News November 28, 2024
సమస్యైతే నాకే ఫోన్ చేయండి: చింతమనేని
‘ఇది మీ ప్రభుత్వం. మీ శ్రేయస్సు మాకు ముఖ్యం’ అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం వంగూరులో బడి బస్సు ఆలస్యంగా వెళ్లింది. దీంతో ఆయన బుధవారం రాత్రి విద్యార్థులతో మాట్లాడారు. ఏ విషయంలో ఎలాంటి అసౌకర్యం కలిగినా సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. వారు స్పందించకపోతే నేరుగా తనకు కాల్ చేస్తే నేరుగా వచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.