News June 15, 2024
T20WC నుంచి పాక్ ఔట్.. జట్టుపై ట్రోల్స్
T20WC గ్రూప్ స్టేజీ నుంచి పాకిస్థాన్ <<13442959>>వైదొలగడంతో<<>> ఆ జట్టును నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఆర్మీ ట్రైనింగ్ అంటూ బిల్డప్ ఇచ్చి బొక్క బోర్లా పడిందంటున్నారు. T20WC-2022లో భారత్ ఓడినప్పుడు బైబై ఇండియా అంటూ పాక్ క్రికెట్ బోర్డు చేసిన ట్వీట్‌కు కౌంటరిస్తున్నారు. గత ఏడాది ఆసియా కప్, వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజ్ నుంచే వెనుదిరిగినా ఆ టీమ్‌లో మార్పులు జరగట్లేదని ఆ దేశ అభిమానులు ఫైరవుతున్నారు.
Similar News
News February 1, 2025
Income Tax: 33% కాదు.. ₹15Lపై 6, ₹25Lపై 13శాతమే పన్ను
మోదీ సర్కారు వేతన జీవులకు భారీ ఊరటే కల్పించింది. Income Tax భారాన్ని అనూహ్యంగా తగ్గించేసింది. ఇకపై ₹13Lకు చెల్లించేది ₹75వేలే. ₹14Lకు ₹90వేలు, ₹15Lకు ₹1.05L, ₹16Lకు ₹1.20L మాత్రమే. అంటే ఎఫెక్టివ్‌లీ వార్షిక వేతనంలో 6 శాతమే పన్ను కడుతున్నట్టు లెక్క. ₹20Lపై ₹2L (10%), ₹25Lపై ₹3.3L (13.2%) పన్నే కట్టాలి. అంతేగానీ సోషల్ మీడియాలో మొత్తుకున్నట్టు 33% చెల్లించరు. శ్లాబులను పట్టుకొని తికమకపడొద్దు.
News February 1, 2025
కోటి మందికి ఊరట
కొత్త పన్ను విధానంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.12లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో కోటి మందికి పైగా ప్రజలకు పన్ను భారం నుంచి ఊరట లభిస్తుందని తాజాగా మీడియాతో వెల్లడించారు. పన్ను శ్లాబుల సవరణలతో ప్రజల చేతుల్లో సరిపడా డబ్బులు ఉండేలా కీలక నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. గతంలో రూ.8లక్షల ఆదాయం ఉన్నవారు రూ.30వేలు పన్ను కట్టేవారని గుర్తుచేశారు.
News February 1, 2025
తులం బంగారం ఏదని నిలదీయాలి: KTR
TG: రాష్ట్రంలో 100% రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తా అని సవాల్ చేశానని, దానిపై సీఎం రేవంత్ స్పందించలేదని KTR అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన రైతుబంధు పైసలు కూడా బీఆర్ఎస్ కూడబెట్టినవే అని చెప్పారు. ‘రేవంత్ సర్కార్ ఒక్క రూపాయి కూడా రైతుబంధు ఇవ్వలేదు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టే రైతుబంధు డ్రామా. ఎకరాకు రూ.17,500 ఇచ్చేదాకా వదిలిపెట్టొద్దు. తులం బంగారం ఏదని మహిళలు నిలదీయాలి’ అని KTR అన్నారు.