News June 15, 2024
పలు జిల్లాల్లో యథావిధిగా చెత్త పన్ను వసూలు!

AP: పట్టణాల్లో చెత్త పన్ను వసూలు <<13401583>>చేయవద్దని<<>> ఉన్నతాధికారులు జారీ చేసిన మౌఖిక ఆదేశాలను కమిషనర్లు బేఖాతరు చేస్తున్నారు. విశాఖ, కాకినాడ, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, ఏలూరు జిల్లాల్లో యథావిధిగా వసూలు చేయాలని ఆదేశిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు రాలేదని ఒత్తిడి చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ సచివాలయాల కార్యదర్శుల జీతాల నుంచి రికవరీ కోసం నోటీసులిస్తున్నారు.
Similar News
News December 31, 2025
డాంగ్ టావో కోడి.. కేజీ మాంసం రూ.1.50 లక్షలు

‘డాంగ్ టావో’ వియత్నాంకు చెందిన కోడి. దీని ఆకారం చాలా వింతగా ఉంటుంది. ఈ కోడి పాదాలు కాస్త లావుగా ఉంటాయి. వియత్నాం రెస్టారెంట్లలో ఈ కోడి మాంసం చాలా స్పెషల్. ఇక్కడి ప్రజలు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ కోడి మాంసాన్ని తినకపోతే తప్పుగా భావిస్తారు. అందుకే ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా ఈ కోడి మాంసాన్ని తింటారు. ఇంత డిమాండ్ వల్లే ఈ మాంసం కిలో దాదాపుగా రూ.1.50 లక్షలుగా ఉంటుంది. సీజన్ బట్టి ధరల్లో మార్పు ఉంటుంది.
News December 31, 2025
నిమ్మకాయ దీపం వెలిగిస్తూ చదవాల్సిన మంత్రాలు..

‘ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే’ అనే మంత్రం పఠిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ‘సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే’ శ్లోకాన్ని చదువుతూ దీపం వెలిగిస్తే కోరికలు నెరవేరుతాయి. ఇవి మనసులో సాత్విక భావనను పెంచి, ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి శాంతిని చేకూరుస్తాయి. దీపారాధన చేసే సమయంలో ఏకాగ్రతతో అమ్మవారిని స్మరించడం వల్ల సంపూర్ణ ఫలితం లభిస్తుంది.
News December 31, 2025
110 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (<


