News June 15, 2024
HYD: యువతులను వేధిస్తే తాటతీస్తాం: సీపీ
బాలికలను, యువతులను, మహిళలను వేధించే పోకిరీలను షీటీమ్స్ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ డా.తరుణ్ జోషి తెలిపారు. నేరేడ్మెట్లో ఆయన మాట్లాడుతూ.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో మఫ్టీలో తిరుగుతూ షీటీం డెకాయ్ ఆపరేషన్లు చేస్తుందని, వేధింపులకు పాల్పడితే తాట తీస్తామని హెచ్చరించారు.
Similar News
News January 15, 2025
HYD: పేరుకే చైనా మాంజా.. తయారీ ఇక్కడే..!
చైనీస్ మాంజా అందుబాటులో ఉండడానికి అసలైన కారణం మన ప్రాంతాల్లోనే తయారు చేస్తున్నట్లు HYD సీపీ ఆనంద్ తెలిపారు. ఈ-కామర్స్ ద్వారా ఎవరైనా ఆర్డర్ చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కామర్స్ గోదాములపై తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సి ఉందని Xలో ట్వీట్ చేశారు. నగరంలో భారీ మొత్తంలో చైనా మాంజాను పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారు.
News January 15, 2025
ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన: హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలన పగా, ప్రతీకారంతోనే కొనసాగిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు, బెయిల్ వ్యవహారంపై ఇవాళ ఉదయం హైదరాబాద్ కోకాపేటలో హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
News January 14, 2025
HYD: నేడే ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
AICC నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొననున్నారు. రేపు, ఎల్లుండి ఢిల్లీలోనే సీఎం, మంత్రులు బస చేయనున్నారు. ఢిల్లీ నుంచే వారం రోజుల పాటు సింగపూర్, దావోస్ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులతో పర్యటించనున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా వెళ్లనున్నారు.