News June 15, 2024
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సర్వీసు పొడిగింపు

TG: కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, గౌరవ వేతన ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బంది సర్వీసును మరో 4 నెలలు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మెమో జారీ చేశారు. వీరి సర్వీసు ఈ ఏడాది మార్చి 31తోనే ముగియగా జులై 31 వరకు అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించాలని సూచించారు.
Similar News
News January 9, 2026
ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 2 వరకు పార్లమెంట్ సెషన్స్ నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 13న తొలి విడత ముగుస్తుందని, ఆ తర్వాత మార్చి 9కి పార్లమెంట్ తిరిగి సమావేశం అవుతుందని వివరించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
News January 9, 2026
తీవ్ర వాయుగుండం.. రేపు వర్షాలు: APSDMA

AP: నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కేంద్రీకృతమై ఉందని APSDMA తెలిపింది. దీంతో శని, ఆదివారాల్లో నెల్లూరు, చిత్తూరు, TPT జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. తీవ్ర వాయుగుండం రేపు మధ్యాహ్నం ఉత్తర శ్రీలంకలోని ట్రింకోమలీ-జాఫ్నా మధ్య తీరాన్ని దాటవచ్చంది.
News January 9, 2026
సౌతాఫ్రికాలో చైనా, రష్యా, ఇరాన్ యుద్ధ నౌకలు!

సౌతాఫ్రికాలో రేపటి నుంచి బ్రిక్స్ దేశాల నేవల్ డ్రిల్స్ జరగనున్నాయి. ఇందుకోసం చైనా, రష్యా, ఇరాన్ యుద్ధ నౌకలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. బ్రిక్స్ మధ్య సహకారాన్ని మరింత పెంచుకోవడానికి కూటమి సభ్యులను ఒకచోటుకు చేర్చుతామని సౌతాఫ్రికా చెప్పింది. UAE తమ నౌకలను, ఇండోనేషియా, ఇథియోపియా, బ్రెజిల్ అబ్జర్వర్లను పంపుతున్నట్లు తెలిపింది. ఇండియా, ఈజిప్ట్, సౌదీ గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.


