News June 15, 2024
HYD: మాత్రలు వికటించి వ్యక్తి మృతి

మద్యం మత్తులో అధిక మొత్తంలో జ్వరం మాత్రలు వేసుకున్న వ్యక్తి మాత్రలు వికటించి మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలంలో జరిగింది. పోలీసుల ప్రకారం.. మెట్లకుంట గ్రామానికి చెందిన పల్లెగడ్డ మల్లేశ్(32) జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మద్యం మత్తులో ఇంట్లో ఉన్న జ్వరం మాత్రలను అధిక మొత్తంలో వేసుకున్నాడు. దీంతో మాత్రలు వికటించి మల్లేశ్ మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News September 18, 2025
HYD: డబ్బు ఊరికే రాదుగా.. జాగ్రత్తలు చెప్పండి!

ఇంట్లోని వృద్ధుల స్మార్ట్ ఫోన్లను గమనిస్తూ ఉండండి. మీరు దగ్గర లేకపోతే జాగ్రత్తలు చెబుతూ ఉండండి. ఇటీవల సైబర్ నేరస్థులు వృద్ధులను టార్గెట్ చేస్తూ డిజిటల్ అరెస్ట్ పేరుతో అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. ఇటీవల బషీర్‌బాగ్‌లో ఓ రిటైర్డ్ లేడీ అధికారి సైబర్ నేరస్థుల బారిన పడి గుండెపోటుతో మృతి చెందారు. అందుకే అన్‌వాంటెడ్ కాల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తొద్దని, పలు జాగ్రత్తలు చెప్పండి.
News September 18, 2025
ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. సిలబస్ భారం తగ్గింపు !

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కొండలా ఉన్న సిలబస్ తగ్గించనుంది. గత 5ఏళ్లుగా నీట్, జేఈఈ, ఎప్సెట్ తదితర ప్రశ్నాపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. ఏఏ భాగం నుంచి ప్రశ్నలు రాలేదో గమనించి ఆ సిలబస్‌ను తొలగించనున్నారు. అయితే ఈ మార్పులు వచ్చే విద్య సంవత్సరం (2026-27)నుంచి అమలు చేయాలని ఆలోచిస్తోందని సమాచారం. ఇదే జరిగితే ఇక స్టూడెంట్స్ హ్యపీయే కదా!
News September 18, 2025
మాదాపూర్ శిల్పారామంలో రేపటినుంచి సందడి

కళాకృతులు, చేనేత వస్త్రాలు, అరుదైన వంటకాలు.. ఇవన్నీ మాదాపూర్ శిల్పారామంలో రేపటినుంచి కొలువుదీరనున్నాయి. 10 రోజుల పాటు నగర ప్రజలను ఆకట్టుకోనున్నాయి. పల్లె గొప్పదనం చెప్పేలా.. పల్లె రుచులు తెలుసుకొనేలా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. శిల్పారామంలో సరస్ మేళా రేపు ప్రారంభం కానుంది. 29వరకు ఈ కార్యక్రమం ఉంటుంది.