News June 15, 2024

ఇద్దరు టీడీపీ నేతలకు గవర్నర్ పదవులు?

image

AP: ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా మారడంతో రెండు గవర్నర్ పదవులు దక్కుతాయని సమాచారం. సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడి పేర్లను సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శాసన సభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు, చీఫ్ విప్‌గా ధూళిపాళ్ల నరేంద్రకు అవకాశం ఇస్తారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ మంత్రి పదవులు ఆశించిన విషయం తెలిసిందే.

Similar News

News January 15, 2025

ఇంటి వద్దకే టెక్నీషియన్లు.. తక్కువ ధరకే సర్వీస్: టీడీపీ

image

AP: వృత్తిదారులను ఆదుకునేందుకు CM CBN ఆదేశాలతో ‘హోమ్ ట్రయాంగిల్ యాప్’తో మెప్మా ఒప్పందం చేసుకుందని TDP వెల్లడించింది. ‘20వేల మంది టెక్నీషియన్లకు మెప్మా శిక్షణ ఇస్తోంది. TV, AC, ఫ్రిజ్, కంప్యూటర్ తదితర 30 రకాల డివైజ్‌లు పాడైతే టెక్నీషియన్లు ఇంటి వద్దకే వచ్చి తక్కువ ధరకే బాగుచేస్తారు. MAR నుంచి 123 పట్టణాల్లో సేవలు అందుబాటులోకి వస్తాయి. ఒక్కో టెక్నీషియన్‌కు ₹20-25వేల ఆదాయం వస్తుంది’ అని పేర్కొంది.

News January 15, 2025

త్వరలో రాహుల్ గాంధీ తెలంగాణ టూర్

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈమేరకు ఆయన పర్యటన ఖరారుపై ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలు చర్చించారు. త్వరలోనే రాహుల్ పర్యటన వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. అటు ఇవాళ ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

News January 15, 2025

ఆస్కార్ అవార్డులు రద్దు? 96 ఏళ్లలో ఇదే తొలిసారి

image

లాస్ ఏంజెలిస్‌లో ఏర్పడిన కార్చిచ్చును ఆర్పడం ఎవరివల్లా కావడం లేదు. ఇంతింతగా పెరుగుతున్న మంటల నుంచి ప్రజలను రక్షించేందుకు అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, ఈ కార్చిచ్చు ‘ఆస్కార్’ను తాకేలా కనిపిస్తోంది. దీనివల్ల ‘ఆస్కార్-2025’ ఈవెంట్ రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే నామినేషన్స్ ప్రకటన కూడా వాయిదా పడింది. ఒకవేళ రద్దయితే 96 ఏళ్లలో ఇదే తొలిసారి కానుంది.