News June 15, 2024

రామగుండం: నెల రోజుల పాటు రైళ్లు బంద్

image

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట- సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య రామగుండం నుంచి నడిచే 14 ప్యాసింజర్, సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నెలరోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సాంకేతిక కారణాలతో ఈరోజు నుంచి రాకపోకలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కొన్నింటిని దారి మళ్లించామని, మరికొన్నింటిని ఆలస్యంగా నడిపిస్తామని వివరించారు.

Similar News

News January 14, 2026

KNR: 6 నెలలకోసారి వైద్య పరీక్షలు తప్పనిసరి: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహిళలు 6 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రేకుర్తిలోని పల్లె దవాఖానాను ఆమె సందర్శించారు. ఈ దవాఖానాలో నిర్వహిస్తున్న ‘ఆరోగ్య మహిళా వైద్య’ పరీక్షలను పరిశీలించారు. పలువురు మహిళలకు బీపీ పరీక్షలు చేయించి, వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రతి మహిళా వైద్య పరీక్షలు చేయించుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

News January 14, 2026

కరీంనగర్ జిల్లాలో 2,292 టన్నుల యూరియా నిల్వలు

image

కరీంనగర్ జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. గత 15 రోజుల్లో వివిధ సొసైటీల ద్వారా 8,124 మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీ చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో మరో 2,292 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, అవసరానికి అనుగుణంగా అదనపు స్టాక్‌ను తెప్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

News January 12, 2026

కరీంనగర్ జిల్లాలో 765 యాక్సిడెంట్స్, 180 మరణాలు

image

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా సోమవారం చొప్పదండిలో కరీంనగర్ డీటీఓ శ్రీకాంత్ చక్రవర్తి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన జిల్లాలో 2025లో 765 రోడ్డు ప్రమాదాలు జరిగి 180 మృతి చెందినట్లు తెలిపారు. చొప్పదండిలోనే 31 యాక్సిడెంట్స్ జరిగాయన్నారు. ఓవర్ లోడ్, మద్యం సేవించి డ్రైవ్ చేయడం, మొబైల్ డ్రైవింగ్ వంటివి ప్రమాదాలకు కారణాలని తెలిపారు. రోడ్ సేఫ్టీ కోఆర్డినేటర్ నీలం సంపత్ పాల్గొన్నారు.