News June 15, 2024

T20WC: చరిత్ర సృష్టించిన యూఎస్ఏ!

image

టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజీ నుంచి సూపర్-8కు చేరిన ఏడో అసోసియేట్ జట్టుగా USA చరిత్ర సృష్టించింది. వర్షం కారణంగా ఐర్లాండ్‌తో మ్యాచ్ రద్దవడంతో USA నేరుగా సూపర్-8కు చేరుకుంది. అంతకుముందు ఐర్లాండ్ (2009), నెదర్లాండ్స్ (2014), అఫ్గానిస్థాన్ (2016), నమీబియా (2021), స్కాట్లాండ్ (2021), నెదర్లాండ్స్ (2022) ఉన్నాయి. కాగా 2026లో ఇండియా, శ్రీలంకలో జరిగే T20 WCకు కూడా USA అర్హత సాధించినట్లు తెలుస్తోంది.

Similar News

News July 7, 2025

తెలంగాణ కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జులు

image

* ఖమ్మం- వంశీచంద్ రెడ్డి, * మెదక్- పొన్నం ప్రభాకర్
* నల్గొండ- సంపత్ కుమార్
* వరంగల్- అడ్లూరి లక్ష్మణ్
* హైదరాబాద్- జగ్గారెడ్డి
* మహబూబ్‌నగర్- కుసుమకుమార్
* ఆదిలాబాద్- అనిల్‌ యాదవ్
* కరీంనగర్- అద్దంకి దయాకర్
* నిజామాబాద్- హుస్సేన్
* రంగారెడ్డి- శివసేనారెడ్డి

News July 7, 2025

కిలోకు రూ.12 చెల్లించి మామిడి కొనుగోళ్లు

image

AP: మద్దతు ధర లేక అల్లాడుతున్న తోతాపురి మామిడి రైతులకు ప్రభుత్వం ఆదుకుంటోంది. ప్రస్తుతం కేజీకి రూ.8 చెల్లిస్తుండగా, ప్రభుత్వం అదనంగా రూ.4 ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిలో మామిడికి రూ.12 చెల్లిస్తున్నారు. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 3.08 మెట్రిక్ టన్నుల మేర మామిడిని ట్రేడర్లు, ప్రాసెసింగ్ యూనిట్ల వారు కొనుగోలు చేశారు.

News July 7, 2025

అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్‌కు ప్రభుత్వం ఆమోదం

image

AP: అమరావతి <<16882676>>క్వాంటమ్ వ్యాలీ<<>> డిక్లరేషన్‌ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2035 నాటికి అమరావతిని ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అభివృద్ధి చేయడమే దీని లక్ష్యమని తెలిపింది. దేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ బెడ్‌గా క్వూ-చిప్-ఇన్‌ను వచ్చే 12 నెలల్లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. 2026లో ప్రారంభమయ్యే అమరావతి క్వాంటమ్ అకాడమీ ద్వారా శిక్షణ, ఫెలోషిప్‌లు అందజేయాలని నిర్ణయించింది.