News June 15, 2024

పవన విద్యుత్‌ ఉత్పత్తిపై సింగరేణి ఫోకస్

image

TG: పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం సంస్థ పరిధిలోని ఉపరితల గనుల మట్టిదిబ్బలు, కొండలు, గుట్టలపై గాలిమరలు ఏర్పాటు చేయనుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇలాంటి ప్లాంట్లపై అధ్యయనం చేస్తోంది. గాలిమరల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలేవి? వాటిని ఏ దిశలో అమర్చాలి? వాటితో ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు? వంటి అంశాలపై మెస్సర్స్ పీఈసీ(ఢిల్లీ) సంస్థతో రీసెర్చ్ చేయిస్తోంది.

Similar News

News October 31, 2025

కాఫీ/ టీ తాగే అలవాటు ఉందా?

image

ఎంతోమందికి ఇష్టమైన కాఫీ, టీలు ఆరోగ్య ప్రయోజనాలను అందించినప్పటికీ వాటిలో ఉండే ‘టాన్సిన్స్’ రసాయనాలు దంతాల రంగును మారుస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇవి దంతాల ఎనామిల్‌పై పేరుకుపోయి కాలక్రమేణా పసుపు లేదా గోధుమ రంగు మరకలకు కారణమవుతాయని చెబుతున్నారు. కాఫీ కంటే టీ తాగేవారికే ఎక్కువ ప్రమాదమని తెలిపారు. అందుకే టీ/కాఫీ తాగాక పుక్కిలించడం లేదా 30 నిమిషాల తర్వాత బ్రష్ చేయడం ఉత్తమం అని సూచిస్తున్నారు.

News October 31, 2025

మహిళల ప్రపంచకప్: భారత్ గెలిచేసిందట!

image

మహిళల ODI వరల్డ్‌కప్‌ను టీమ్ ఇండియా గెలిచేసిందంటూ ‘వికీపీడియా’ చెప్పడం చర్చనీయాంశమవుతోంది. ‘50 ఓవర్లలో ఇండియా 326-5 రన్స్ చేసింది. సౌతాఫ్రికా 43.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌట్ అయింది’ అని సైట్‌లో కనిపించింది. వికీపీడియాలో ఎవరైనా మార్పులు చేయగలిగే ఓపెన్ ఎడిటింగ్ పాలసీ వల్ల ఇలా జరిగిందని తెలుస్తోంది. తర్వాత సరిదిద్దినట్లు సమాచారం. నవంబర్ 2న సౌతాఫ్రికా, భారత్ మధ్య నవీ ముంబై‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

News October 31, 2025

తెలంగాణలో IASల బదిలీ

image

*అభివృద్ధి, సంక్షేమ పథకాల స్పెషల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా సవ్యసాచి ఘోష్
*గురుకుల సంక్షేమ కమిషనర్‌గా అనితా రామచంద్రన్‌కు పూర్తి అదనపు బాధ్యతలు
*రవాణా శాఖ కమిషనర్‌గా ఇలంబర్తి
*జీఏడీ పొలిటికల్‌ ఇన్‌ఛార్జ్‌ సెక్రటరీగా E.శ్రీధర్‌
*ఆయిల్‌ ఫెడ్‌ ఎండీగా యాస్మిన్‌ బాషా
*మెట్రోపాలిటన్‌ ఏరియా, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ఛార్జ్‌ సెక్రటరీగా సీఎస్‌ రామకృష్ణారావుకు అదనపు బాధ్యతలు