News June 15, 2024
అద్దంకి: టీడీపీ ఫ్లెక్సీల చించివేత

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు విద్యుత్ శాఖ మంత్రిగా కేబినెట్‌లో స్థానం లభించడంతో మండలంలోని మక్కెన వారి పాలెం ఎస్సీ కాలనీలో అభినందనలు తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను శుక్రవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. దాంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News September 13, 2025
ప్రకాశం జిల్లా SPగా హర్షవర్ధన్ రాజు

ప్రకాశం జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ రాజు శనివారం నియమితులయ్యారు. అలాగే ప్రకాశం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న A.R దామోదర్‌ను విజయనగరంకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో తిరుపతి SPగా పనిచేస్తున్న హర్షవర్ధన్ రాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా బదిలీ కాగా ఆమె స్థానంలో రాజాబాబు నియమితులై నేడే భాద్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
News September 13, 2025
రేగలగడ్డలో భార్యను చంపి, భర్త ఆత్మహత్యాయత్నం

మర్రిపూడిలోని రేగలగడ్డలో దారుణం జరిగింది. నారాయణ భార్య అంజమ్మను శుక్రవారం రాత్రి గొంతుకోసి చంపి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంజమ్మ చనిపోగా.. నారాయణ కొన ఊపిరితో ఉన్నాడు. గ్రామస్థులు సమాచారం పోలీసులకు అందజేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 12, 2025
ప్రకాశం: బార్ల లైసెన్సులకు గడువు పొడిగింపు

ప్రకాశం జిల్లాలోని 4 ఓపెన్ కేటగిరి బార్ల లైసెన్సులకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2, మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో 2 ఓపెన్ బార్ల లైసెన్స్‌ల కొరకు దరఖాస్తు గడువు గతంలో 14వ తేదీ వరకు నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆ గడువు తేదీని 17 వరకు పొడిగించామన్నారు.