News June 15, 2024
మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు
AP: ప్రభుత్వ స్కూళ్లలో ఏడాదిలోగా పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. విద్యాశాఖపై ఆయన అధికారులతో సమీక్షించారు. ‘కొత్త పనులు, నిలిచిన పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలి. ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేట్ బడులకు విద్యార్థులు మారేందుకు గల కారణాలను విశ్లేషించి నివేదిక ఇవ్వాలి. గత ఐదేళ్లలో ఎన్ని బడులు మూతపడ్డాయి? దానికి కారణాలు ఏంటి?’ అనే వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News January 16, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’: రెండ్రోజుల్లో రూ.77 కోట్లు
విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కలెక్షన్లలో దూసుకెళ్తోంది. రెండు రోజుల్లోనే రూ.77 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈరోజు కూడా బుక్ మై షోలో వేలల్లో టికెట్స్ బుక్ అవడంతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి. మూవీలో వెంకీ కుటుంబం చేసిన కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను తెగ మెప్పిస్తోంది.
News January 16, 2025
నథింగ్ డేను జరుపుకుంటున్నారా?
ఒక్కో రోజుకు ఒక్కో స్పెషాల్టీ. ఈరోజు కూడా ఓ స్పెషల్ ఉంది. నేడు అమెరికాలో నేషనల్ నథింగ్ డే. అక్కడి ప్రజలు తమ బిజీ షెడ్యూల్ నుంచి విరామం తీసుకుని, విశ్రాంతి పొందేందుకు ఒక రోజు అవసరమని కాలమిస్ట్ హెరాల్డ్ పుల్‌మన్ కాఫిన్ విశ్వసించారు. అందుకే ఈరోజు పనులన్నీ పక్కన పెట్టాలంటారు. ప్రజలు తమకిష్టమైన వారిని, స్నేహితులను ఆలింగనం చేసుకొని విష్ చేసుకోవాలని సూచిస్తుంటారు. 1973 నుంచి దీనిని జరుపుకుంటున్నారు.
News January 16, 2025
ముందే చొరబడ్డ దుండగుడు!
సైఫ్ అలీ ఖాన్‌పై కత్తిపోట్ల ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అర్ధరాత్రి 2.30 గంటలకు ఈ ఘటన జరగ్గా రా.12.30 గంటల తర్వాత ఎవరూ ఆ ఇంట్లోకి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో ఆనవాళ్లు లేవని పోలీసు వర్గాలు వెల్లడించాయి. దీన్నిబట్టి దుండగుడు ప్లాన్ ప్రకారం ముందే ఇంట్లోకి చొరబడి ఉంటాడని భావిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని మండిపడుతున్నాయి.