News June 15, 2024

ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం: పవన్

image

AP: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు అందించడంపై దృష్టిపెడతానని మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయన్నారు. ‘ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం నాకు కలిగింది. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం. అడవుల వినాశనానికి పాల్పడితే ఎంతటి వారైనా జైలుకు వెళ్లాల్సిందే. సామాజిక వనాలు పెంచాల్సిన అవశ్యకత ఉంది’ అని అన్నారు.

Similar News

News January 10, 2026

అమరావతిలో క్వాంటం సెంటర్‌కు టెండర్ ఖరారు

image

AP: రాజధానిలో క్వాంటం వ్యాలీ నిర్మాణ దిశగా మరో కీలక అడుగు పడింది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి సంబంధించిన టెండర్‌ను APCRDA ఖరారు చేసింది. రూ.103 కోట్లతో L-1 బిడ్‌గా నిలిచిన ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగిస్తూ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ జారీ చేసింది. ఈ ప్రాజెక్టు నమూనా రూపకల్పన నుంచి నిర్మాణం వరకూ L&Tనే చేపట్టనుంది. సెంటర్ నిర్మాణానికి CRDA నిధుల నుంచి రూ.137 కోట్లు కేటాయించారు.

News January 10, 2026

తిరుపతి SVIMSలో ఉద్యోగాలు

image

తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ (<>SVIMS<<>>) 22పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 12వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, డిగ్రీ+MSW, GNM, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: http://svimstpt.ap.nic.in/

News January 10, 2026

శని దేవుని ఆరాధనతో అనారోగ్య నివారణ

image

శనివారం రోజున శని దేవుడిని ఆరాధిస్తే అనారోగ్య సమస్యలు సన్నగిల్లుతాయని జ్యోతిషులు చెబుతున్నారు. పలు శని దోషాలతో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కోసం నువ్వుల నూనెతో మర్ధన చేసుకోవాలని, శని శాంతి మంత్రాన్ని పఠించాలని సూచిస్తున్నారు. అందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఎముకలు, రక్తనాళాలను దృఢపరుస్తాయి. వ్యాయామం, ధ్యానం, ఆలయ ప్రదక్షిణలతో శని దేవుడు తృప్తి చెంది సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం.