News June 15, 2024

‘ఫర్నిచర్ దొంగ జగన్’ అంటూ TDP ట్వీట్

image

AP సచివాలయ ఫర్నిచర్ మాజీ CM జగన్ ఇంట్లో ఉందని ఆరోపిస్తూ TDP Xలో ఆరోపణలు చేసింది. ‘లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినా జగన్‌కి ప్రజల సొమ్ము మీద మోజు తీరలేదు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని సచివాలయ ఫర్నిచర్‌తో నింపేసాడు. పదవి ఊడిపోయాక ఆ ఫర్నిచర్ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలి కదా! అయినా ఇవ్వలేదు. ఫర్నిచర్ దొంగ జగన్’ అని Xలో ఓ ఫొటోను పంచుకుంది. దీనిపై YCP స్పందించాల్సి ఉంది.

Similar News

News November 6, 2025

రేషన్ షాపుల్లో రూ.18కే గోధుమ పిండి: నాదెండ్ల

image

AP: జనవరి 1 నుంచి పట్టణాల్లోని రేషన్ షాపుల్లో గోధుమ పిండి పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘2400 మెట్రిక్ టన్నులు సిద్ధం చేస్తున్నాం. కిలో రూ.18 చొప్పున రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తాం. నవంబర్‌లో వర్ష సూచన నేపథ్యంలో కౌలు రైతులకు ఉచితంగా 50 వేల టార్పాలిన్లు ఇస్తాం. ధాన్యం అమ్మిన రైతులకు అదే రోజు ఖాతాల్లో డబ్బు జమయ్యేలా ఏర్పాట్లు చేశాం. సెలవుంటే తర్వాత రోజు పడతాయి’ అని తెలిపారు.

News November 6, 2025

తడిసిన ధాన్యం కొంటాం: ఢిల్లీరావు

image

AP: 17% వరకు తేమ ఉన్న ధాన్యాన్నీ కొంటామని సివిల్ సప్లై కార్పొరేషన్ MD ఢిల్లీరావు రైతులకు హామీ ఇచ్చారు. వివిధ రైతు సంఘాల నేతలు ఆయన్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. మద్దతు ధరకు అదనంగా గోనె సంచులు, రవాణా ఖర్చులివ్వాలని రైతులు కోరారు. మిల్లర్ల యాజమాన్యాల నుంచి వేధింపులను అడ్డుకోవాలన్నారు. పంటనష్ట పరిహారం, ధాన్యం కొనుగోలు, తేమశాతం అంచనాపై సమస్యలుంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని ఢిల్లీరావు రైతులకు తెలిపారు.

News November 6, 2025

గోరింటాకు ధరించడం వెనుక శాస్త్రీయత

image

పెళ్లిళ్లు, పండుగలప్పుడు ఆడపిల్లలు గోరింటాకు ధరించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. అయితే, ఈ ఆచారం వెనుక కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. గోరింటాకు అనేది ఓ ఔషధ మూలిక. పెళ్లి చేసుకున్నప్పుడు నూతన వధువులో సహజంగానే కాస్త భయం, ఆందోళన ఉంటుంది. ఆ ఫీలింగ్స్‌ను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే శరీరాన్ని చల్లబరుస్తుంది. ఒంట్లో వేడిని తగ్గించి, నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది.