News June 15, 2024

బాధ్యతలను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తా: ప్రత్తిపాటి

image

నియోజకవర్గ ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి తనకు అప్పగించిన బాధ్యతలను త్రికరణ శుద్ధిగా అమలు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. శనివారం ఎమ్మెల్యేను నియోజకవర్గంలోని పలువురు టీడీపీ శ్రేణులు కలిసి అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన కొనసాగిస్తానని, సంక్షేమ అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలా కృషి చేస్తానని తెలిపారు.

Similar News

News November 6, 2025

సాహితీ త్రిముఖుడు డా. పాపినేని శివశంకర్

image

పాపినేని శివశంకర్ సుప్రసిద్ధ కవి, కథకులు విమర్శకులుగా ప్రసిద్ధి చెందారు. ఆయన్ను ‘సాహితీ త్రిముఖుడు’ అని పిలుస్తారు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం ఆయనకు లభించింది. ఆయన రాసిన కవితా సంపుటి ‘రజనీగంధ’కు 2016లో ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. శివశంకర్ గుంటూరు జిల్లా నెక్కల్లు గ్రామంలో జన్మించారు. ఆయన తాడికొండ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా, ప్రిన్సిపల్‌గా పనిచేశారు.

News November 6, 2025

గుంటూరు: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ 7న గుంటూరులో జరిగే కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎస్పీ వకుల్ జిందల్, కలెక్టర్ తమీమ్ అన్సారీయాతో కలిసి హెలిపాడ్, రాకపోక మార్గాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా ప్రణాళికపై అధికారులకు సూచనలు చేసి సమన్వయంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News November 5, 2025

గుంటూరు: ‘ప్రైవేట్ కాలేజీల నిర్లక్ష్యంపై చర్యలేవి’

image

రాజధాని అమరావతిలోని ప్రైవేట్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలలో నిల్వ ఉంచిన ఆహారాన్ని విద్యార్థులకు పెట్టడంతో విద్యార్థుల ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. రాజధానిలో ప్రైవేట్ కాలేజీల నిర్లక్ష్యంపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.