News June 15, 2024
కడప దివ్యాంగుడికి ఆర్థిక సహాయం చేసిన సీఎం చంద్రబాబు

కడప నగరంలోని రాజారెడ్డికి వీధికి చెందిన దివ్యాంగుడు కనపర్తి మనోజ్ కుమార్‌కు సీఎం చంద్రబాబు ఆర్థిక సహాయం ప్రకటించారు. శనివారం మంగళగిరిలో సీఎం చంద్రబాబును మనోజ్ కలిశారు. తన సమస్యను వివరించి వైద్యం కోసం ఆర్థిక సహాయం చేయాలని కోరగా.. సీఎం అతడికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. మనోజ్ కుమార్ చాలా రోజుల నుంచి అనారోగ్యంతో వీల్ చైర్‌కే పరిమితమయ్యాడు.
Similar News
News January 12, 2026
కడప జాయింట్ కలెక్టర్‌గా నిధి మీనా

కడప జాయింట్ కలెక్టర్‌గా నిధి మీనా నియమితులు కానున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన అతిథి సింగ్ బదిలీ అయ్యారు. ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్‌ల బదిలీలలో భాగంగా జాయింట్ కలెక్టర్‌గా నిధి మీనా జిల్లాకు రానున్నారు. త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్‌ల బదిలీలు చోటు చేసుకున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.
News January 12, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు.!

* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,290
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,147
* వెండి 10 గ్రాములు ధర రూ.2,620.
News January 12, 2026
కడప: ఒక MRO సస్పెండ్.. మరో 11 మందికి నోటీసులు

రైతులకు పాసు పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులపై కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కొరడా ఝులిపించారు. ముఖ్యంగా జిల్లా అతి తక్కువగా పాసు పుస్తకాలను పంపిణీ చేసిన తొండూరు MRO రామచంద్రుడు సస్పెండ్ చేశారు. అలాగే చెన్నూరు, పెండ్లిమర్రి, VNపల్లె, గోపవరం, పోరుమామిళ్ల, కలసపాడు, చక్రాయపేట, ఖాజీపేట, B.మఠం, ప్రొద్దుటూరు, CK దిన్నె MROలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.


