News June 16, 2024

సైబర్ నేరగాళ్లు పంపిస్తున్న మెసేజ్ లకు స్పందించవద్దు: సీపీ

image

ఎస్బీఐ యూనో అప్లికేషన్స్ ఉపయోగిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు పంపిస్తున్న లింకులు, మెసేజ్ లను స్పందించి మోస పోవద్దని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏ బ్యాంక్ అయినా అప్ డేట్ కోసం వివరాలు అడగవని, మోసపూరిత మెసేజ్‌లలో వచ్చిన లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News February 27, 2026

BREAKING.. డీజీపీ శివధర్ రెడ్డి ఖమ్మం పర్యటన రద్దు

image

డీజీపీ శివధర్ రెడ్డి నేటి ఖమ్మం పర్యటన అనివార్య కారణాలతో రద్దయింది. కొత్త పోలీస్ భవనాల ప్రారంభోత్సవం, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, చివరి నిమిషంలో పర్యటన వాయిదా పడినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పర్యటన మళ్లీ ఎప్పుడు ఉండేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

News February 27, 2026

సర్పంచ్ నుంచి జిల్లా స్థాయికి

image

కారేపల్లి పోలంపల్లి సర్పంచ్ హేమలత బాలాజీ నాయక్‌కు అరుదైన గౌరవం దక్కింది. గ్రామాభివృద్ధిలో ఆమె చూపుతున్న చొరవను గుర్తిస్తూ జిల్లా ‘దిశ’ కమిటీ సభ్యురాలిగా ప్రభుత్వం ఎంపిక చేసింది. సామాన్య సర్పంచ్‌గా ప్రస్థానం మొదలుపెట్టి, జిల్లా స్థాయి వేదికకు ఎంపికవ్వడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమస్యలను జిల్లా స్థాయిలో వినిపించి, మరిన్ని నిధులు సాధిస్తానని ఆమె ఆకాంక్షించారు.

News February 27, 2026

ఏరుగట్లలో గుప్తనిధుల కలకలం..!

image

పెనుబల్లి మండలం ఏరుగట్లలో గుప్తనిధుల వేట కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి ముత్యాలమ్మ గుడి సమీపంలో క్షుద్రపూజలు నిర్వహిస్తూ, జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో నిందితులు పట్టుబడ్డారు. ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకున్న వీఎం బంజర్ పోలీసులు..ఘటనా స్థలంలో జేసీబీ, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.