News June 16, 2024
MLAగా విజయం.. కాలినడకన ద్వారకాతిరుమలకు

ఏలూరు జిల్లా పోలవరం MLAగా చిర్రి బాలరాజు విజయం సాధించిన నేపథ్యంలో ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయానికి స్థానిక టీడీపీ, జనసేన నాయకులు శనివారం కాలినడక బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి గెలిస్తే పాదయాత్రగా వస్తామని మొక్కుకున్నట్లు తెలిపారు. నరసింహమూర్తి, శ్రీను, ప్రసాద్, కృష్ణ తదితరులు ఉన్నారు.
Similar News
News October 30, 2025
నరసాపురం: చెరువులో పడి దివ్యాంగుడి మృతి

నరసాపురం మండలం లిఖితపూడి గ్రామానికి చెందిన దివ్యాంగుడు పెచ్చేట్టి సుబ్బారావు (75) గురువారం ముఖం కడుక్కోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయాడు. ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్, ఫైర్ సిబ్బంది తీవ్రంగా గాలించగా, సాయంత్రం చెరువులో సుబ్బారావు మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News October 30, 2025
తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వెయ్యాలి: కలెక్టర్

తుఫాను కారణంగా జరిగిన ప్రతి నష్టాన్ని అంచనా వెయ్యాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఈ మేరకు గురువారం ఆమె కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్యం మెరుగుదలకు పత్యేక శ్రద్ధ పెట్టాలి, తాగునీరు సమస్య లేకుండా చూడాలన్నారు. అనంతరం సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
News October 30, 2025
పంట వివరాలను 5రోజుల్లో నివేదిక ఇవ్వాలి: జేసీ

మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో నీట మునిగిన పంటల వివరాలను ఐదు రోజుల్లో సేకరించి నివేదిక సమర్పించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన కార్యాలయం నుంచి మొంథా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల వలన నీట మునిగిన పంటల వివరాలను తెలుసుకునేందుకు సంబంధిత శాఖల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


