News June 16, 2024

ఆ కారణంతోనే TCSలో 80వేల ఖాళీలు!

image

దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్‌లో 80వేల ఖాళీలు ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. స్కిల్స్ ఉన్న అభ్యర్థుల కొరతతోనే వాటి భర్తీ ప్రక్రియ నిలిచిపోయినట్లు పేర్కొంది. నైపుణ్యాలు లేదా ఉద్యోగి ఆకాంక్షలు ప్రాజెక్టు అవసరాలకు సరిపోవడంలేదని ఆ సంస్థ ఉద్యోగి TOIకి వెల్లడించారు. కాగా గత రెండేళ్లుగా TCSలో ఉద్యోగ నియామక జాప్యం వల్ల 10వేల మంది ఫ్రెషర్లు ప్రభావితమైనట్లు NITES పేర్కొంది.

Similar News

News October 6, 2024

PHOTOS: ముత్యాల పందిరిలో శ్రీనివాసుడి విహారం

image

తిరుమల బ్రహ్మోత్సవాలు మూడో రోజు కనులపండువగా సాగాయి. ఇవాళ శ్రీమలయప్పస్వామి ముత్యాల పందిరిపై విహరించారు. శ్రీవారిని దర్శించుకొని భక్తులు తన్మయత్వం పొందారు. తిరుమల గిరులు శ్రీనివాసుడి నామస్మరణతో మార్మోగాయి. వేంకటేశ్వరుడి విహారం సందర్భంగా మాడవీధుల్లో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

News October 6, 2024

రజినీ-మణిరత్నం కాంబోలో సినిమా?

image

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు మణిరత్నం కలిసి చివరిగా 1991లో ‘దళపతి’కి పనిచేశారు. తిరిగి ఇన్నేళ్ల తర్వాత మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 12న రజినీ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్టుపై అధికారికంగా అనౌన్స్‌మెంట్ రావొచ్చని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు కమల్ హాసన్‌తో సైతం ‘థగ్ లైఫ్’ ద్వారా 36 ఏళ్ల తర్వాత మణిరత్నం వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే.

News October 6, 2024

ఆంధ్రుల హక్కు ముఖ్యమా.. పొత్తు ముఖ్యమా?: షర్మిల

image

AP: సీఎం చంద్రబాబుకు ఆంధ్రుల హక్కులు ముఖ్యమా, లేదంటే బీజేపీతో పొత్తు ముఖ్యమా అని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ అంశంపై మోదీ, అమిత్ షాను నిలదీయాలని ఆమె డిమాండ్ చేశారు. ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని డిమాండ్ చేయాలి. రాష్ట్ర ప్రయోజనాల కంటే పొత్తు ప్రయోజనాలు అంత ముఖ్యమేమీ కాదు’ అని ఆమె పేర్కొన్నారు.