News June 16, 2024
ఎన్టీఆర్ మూవీలో ‘యానిమల్’ విలన్?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కే మూవీలో యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని శక్తిమంతమైన విలన్ పాత్ర కోసం ఆయనను ప్రశాంత్ నీల్ కలిసినట్లు టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం NTR దేవర, వార్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ ‘సలార్’ పార్ట్-2 తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇవి పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని సమాచారం.
Similar News
News January 8, 2026
‘మున్సిపోల్స్’లో పట్టు కోసం పార్టీల కసరత్తు

TG: మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. సంక్షేమ పథకాల అజెండాతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లనుంది. అటు CM రేవంత్ జిల్లాల్లో సభల్లో పాల్గొంటారు. FEB3-9 మధ్య 9 ఉమ్మడి జిల్లాల్లో ఉండే ఈ టూర్ MBNRలో మొదలవుతుంది. ఇక ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక పెండింగ్ అంశాలతో BRS స్పెషల్ మ్యానిఫెస్టో రూపొందించనుంది. అర్బన్‌లో పట్టుకై BJP సీరియస్‌గా స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తోంది.
News January 8, 2026
KVS, NVSలో 15,762 ఉద్యోగాలు.. అడ్మిట్ కార్డులు విడుదల

KVS, NVSలో 15,762 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. జనవరి 10, 11 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డు <
News January 8, 2026
పేరుకే పెద్దన్న.. బాధ్యతల నుంచి పరార్: ట్రంప్ ద్వంద్వ నీతి!

ప్రపంచ దేశాలపై పెత్తనాలు చలాయించే అమెరికా అంతర్జాతీయ బాధ్యతల విషయంలో మాత్రం చేతులెత్తేస్తోంది. 66 అంతర్జాతీయ సంస్థల నుంచి తప్పుకోవడం ట్రంప్ ద్వంద్వ నీతిని తెలియజేస్తోంది. అంతా తన గుప్పిట్లో ఉండాలని కోరుకునే ‘పెద్దన్న’ నిధుల వృథా సాకుతో తప్పుకోవడం విడ్డూరం. ‘అమెరికా ఫస్ట్’ పేరుతో బాధ్యతల నుంచి వైదొలగడం అంటే పరోక్షంగా అగ్రరాజ్య హోదాకు ఎసరు పెట్టుకోవడమేననే విశ్లేషణలు వెలువడుతున్నాయి.


