News June 16, 2024
మ్యాచ్ రద్దవడంపై మాజీల అసంతృప్తి
మైదానాన్ని పూర్తిగా కప్పడానికి కవర్లు లేని చోట ICC మ్యాచ్‌లు నిర్వహించకూడదని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించారు. నిన్న వర్షం తగ్గి గంటలు గడిచినా లాడర్‌హిల్ స్టేడియంలో ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో భారత్, కెనడా మ్యాచ్ రద్దవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పిచ్‌ను కవర్ చేసి మైదానాన్ని వదిలేయకూడదని చెప్పారు. ‘ఇంత డబ్బున్నా ఔట్ ఫీల్డ్ తడిగా ఉందని మ్యాచ్‌ల రద్దు సరికాదు’ అని మైకెల్ వాన్ అన్నారు.
Similar News
News January 16, 2025
2047 నాటికి ఏపీ తలసరి ఆదాయం రూ.58.14 లక్షలు
AP: ప్రస్తుతం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2.68 లక్షలుగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. 2047 నాటికి ఈ మొత్తం రూ.58.14 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేశారు. తాము విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్‌కు దేశంలోనే తొలిసారి 16 లక్షల వ్యూస్ వచ్చాయన్నారు. వికసిత్ భారత్‌కు కూడా ఈస్థాయిలో స్పందన రాలేదని తెలిపారు. 2047కు 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడమే తమ లక్ష్యమన్నారు.
News January 16, 2025
ఈ ఏడాది 90 కోట్లకు ఇంటర్నెట్ యూజర్లు
దేశవ్యాప్తంగా 2024లో 88.6Cr ఉన్న ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య ఈ ఏడాదిలో 90Crకు చేరుకుంటుందని ఓ రిపోర్టు వెల్లడించింది. మొత్తం వినియోగదారుల్లో 55%(48.8Cr) గ్రామీణ ప్రాంతాల ప్రజలే ఉంటారని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(IAMAI) తెలిపింది. 98% మంది IND భాషల్లోనే నెట్‌ను యూజ్ చేశారంది. తెలుగు, తమిళ్, మలయాళం వంటి భాషల్లో కంటెంట్ విస్తృతంగా అందుబాటులో ఉండటం వల్ల ప్రజాధరణ లభిస్తోందని పేర్కొంది.
News January 16, 2025
చరిత్ర సృష్టించిన ప్రతిక
IND-W జట్టు ఓపెనర్ ప్రతికా రావల్ వన్డేల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆడిన తొలి 6 ఇన్నింగ్స్‌లలో అత్యధిక రన్స్(444) సాధించిన ప్లేయర్‌గా నిలిచారు. ప్రతిక తర్వాతి స్థానాల్లో చార్లెట్ ఎడ్వర్డ్స్(ENG)-434, నథాకన్(థాయ్‌లాండ్)-322, ఎనిడ్ బేక్‌వెల్(ENG)-316, నికోలే బోల్టన్(ఆస్ట్రేలియా)-307 ఉన్నారు. కాగా ప్రతిక సైకాలజీలో డిగ్రీ చేశారు. తండ్రి ప్రదీప్ దేశవాళీ టోర్నీల్లో అంపైర్.