News June 16, 2024

గుంటూరులో వ్యభిచార గృహాలపై దాడి

image

వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళపై శనివారం నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు మల్లారెడ్డి నగర్‌లో ఓ మహిళ తన ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుందని వచ్చిన సమాచారంతో, శనివారం నగరంపాలెం సీఐ మధుసూదనరావు సిబ్బందితో తనిఖీలు చేశారు. తనిఖీల్లో అయిదుగురు మహిళలను అదుపులోకి తీసుకొని పునరావాస కేంద్రానికి తరలించారు.

Similar News

News October 3, 2024

చేనేత వస్త్రాలను అందరూ ఆదరించాలి: మంత్రి సవిత

image

చేనేత వస్త్రాలను ఆదరించి, నేత కార్మికులకు అందరూ అండగా నిలవాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత సూచించారు. గుంటూరులోని సిద్ధార్థ గార్డెన్స్ లో బుధవారం ఏర్పాటు చేసిన చేనేత, వస్త్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు చెందిన నాణ్యమైన వస్త్రాలు ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. దసరా పండగ సందర్భంగా ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News October 2, 2024

చుండూరు: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

image

గూడ్స్ రైలు పట్టాలు తప్పిన సంఘటన చుండూరు రైల్వే స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. తెనాలి నుంచి చుండూరు మధ్య గల రైల్వే పట్టాలపై గూడ్స్ రైలు వెనక ఉన్న బ్రేక్ వ్యాన్ పట్టాలు తప్పడంతో రైలును నిలిపివేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News October 2, 2024

వైసీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణపై కేసు నమోదు

image

వైసీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణపై గుంటూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై అంబటి మురళి, మరో 12 మంది సెప్టెంబర్ 28న పట్టణంలోని శ్రీసహస్రలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నిరసన ధర్నా నిర్వహించారు. వైసీపీ నేతలు భక్తులను లోపలకు వెళ్లనివ్వకుండా ధర్నా చేశారని టీడీపీ నాయకుడు నరేశ్ ఫిర్యాదు చేయగా.. విచారించిన పోలీసులు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు.