News June 16, 2024

మెదక్: గుప్తనిధి బంగారం అంటూ మోసం 

image

జేసీబీ తవ్వకాల్లో బంగారం దొరికిందని మోసంతో రూ. 13 లక్షల తీసుకొని నకిలీ బంగారం అప్పగించిన ఏపీ రాష్ట్రం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం శివారు పాలెం గ్రామానికి చెందిన ఎం.ఆదెప్ప (32)ను అరెస్టు చేసినట్లు గౌరారం ఎస్సై శివకుమార్ తెలిపారు. జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన బలిజ గూడెం స్వామి మోసం చేశారు. వారి వద్ద నుంచి ఏడు లక్షల నగదు స్వాధీనం చేసుకోగా.. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు

Similar News

News January 15, 2025

మెదక్: చాముండేశ్వరి దేవిని దర్శించుకున్న ఎస్పీ

image

మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలంలోని చిట్కుల్ మంజీరా నది తీరాన వెలసిన శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయాన్ని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మంగళవారం సతీసమేతంగా సందర్శించారు. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ఎస్పీ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వీరితోపాటు చిలిపిచేడ్ మండల ఎస్ఐ నర్సింలు, సిబ్బంది పాల్గొన్నారు.

News January 14, 2025

మెదక్: జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు మంత్రి

image

జిల్లా ప్రజలకు మంత్రి దామోదర రాజనర్సింహ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. రైతు రుణమాఫీ, సకాలంలో ధాన్యం కొనుగోలు, సన్నాలకు రూ.500 బోనస్ తదితర కార్యక్రమాల్లో ప్రజల్లో హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి రైతులు, వ్యవసాయ కూలీలకు అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు, పేద ప్రజలకు ఉద్దేశించి రేషన్ కార్డుల జారీ చేయనున్నామని అన్నారు.

News January 14, 2025

MDK: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో

image

సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 9100153883 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.