News June 16, 2024

ఈనెల 17న పలు రైళ్లు రద్దు

image

రైల్వే ట్రాక్ పై వంతెన మరమ్మతులు కారణంగా ఈ నెల 17వ తేదీన పలు రైళ్లు అధికారులు రద్దు చేశారు. ఈ సందర్భంగా వాల్తేరు డివిజన్ పరిధిలోని కోటబొమ్మాళి-టీలేరు మధ్య నడిచే రైళ్లు రద్దయ్యాయి. అలాగే పలాస-విశాఖ-పలాస ప్యాసింజర్ రైళ్లను కూడా రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ సందర్భంగా వాల్తేరు డీసీఎం సందీప్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

Similar News

News November 5, 2025

శ్రీకాకుళం: మీలో ప్రతిభకు ఈ పోటీలు

image

యువజన సర్వీసుల శాఖ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో (జానపద బృంద నృత్యం, గీతాలు), స్టోరీ రైటింగ్, కవిత్వం, చిత్రలేఖనం, డిక్లమేషన్ పోటీలను NOV 11న నిర్వహించనున్నారు. ఆ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పలనాయుడు ప్రకటనలో తెలిపారు. 15-29 ఏళ్లు ఉన్న యువతీ, యువకులు అర్హులని, శ్రీకాకుళం(M)మునసబపేటలోని గురజాడ ఆడిటోరియంలో పోటీలు జరుగుతాయన్నారు. వివరాలకు పని వేళల్లో ఈనం:97041 14705ను సంప్రదించాలన్నారు.

News November 5, 2025

నేడు శ్రీకాకుళం జిల్లా సమీక్ష సమావేశం: కలెక్టర్

image

శ్రీకాకుళం జిల్లా సమీక్షా సమావేశం బుధవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం వెల్లడించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ప్రవాస భారతీయుల సాధికారత సంబంధాల శాఖ, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అధ్యక్షతన జరుగుతుందన్నారు. అజెండాలోని అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించనున్నట్లు వివరించారు.

News November 4, 2025

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి: శ్రీకాకుళం కలెక్టర్

image

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం శ్రీకాకుళం కలెక్టర్ మందిరంలో సమీక్ష నిర్వహించారు. 6.50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి 5500 వాహనాలకు జీపీఎస్ వినియోగం సాధ్యం కానందున 9 బృందాలను ఏర్పాటు చేసి ట్రాకింగ్ డివైజ్‌లు ఇన్‌స్టాల్ చేయాలన్నారు. 200 ఈ-హబ్ ఛార్జింగ్ స్టేషన్లకు స్థలం పరిశీలించాలన్నారు.