News June 16, 2024
పాక్ జట్టులో ఆ ఐదుగురిని పీకేయండి: అహ్మద్ షెహజాద్
T20 WCలో పాకిస్థాన్ సూపర్-8కు అర్హత సాధించకపోవడంతో ఆ జట్టు మాజీ ప్లేయర్ అహ్మద్ షెహజాద్ మండిపడ్డారు. పాక్ జట్టులో ఐదుగురు ఆటగాళ్లను వెంటనే తప్పించాలని డిమాండ్ చేశారు. ‘నాలుగైదేళ్లుగా బాబర్, రిజ్వాన్, ఫకర్ జమాన్, షాహీన్ అఫ్రీది, హారీస్ రవూఫ్ రెగ్యులర్‌గా ఆడుతున్నారు. వీరంతా వ్యక్తిగత రికార్డులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే పాక్ క్రికెట్ నాశనమైంది. వీరిని జట్టు నుంచి తప్పించాలి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 2, 2025
సండే క్రికెట్ ఫీవర్.. నేడు రెండు మ్యాచ్‌లు
IND క్రికెట్ అభిమానులకు సండే బొనాంజా. ఇవాళ 2 మ్యాచ్‌లు కనువిందు చేయనున్నాయి. U-19 ఉమెన్స్ WCలో అజేయంగా అదరగొట్టిన భారత్ నేడు ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. మ.12 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక మెన్స్ క్రికెట్‌లో ENGపై ఇప్పటికే T20 సిరీస్ కైవసం చేసుకున్న సూర్య సేన నేడు చివరి టీ20లో తలపడనుంది. రా.7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. రెండింటినీ స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.
News February 2, 2025
NPS వాత్సల్య.. రూ.50వేలకు పన్ను మినహాయింపు
బాల, బాలికలకు ఆర్థిక భద్రతను కల్పించే <<14158275>>NPS వాత్సల్య పథకంపై<<>> కేంద్రం కీలక ప్రకటన చేసింది. సెక్షన్ 80CCD(1B) కింద ఈ స్కీమ్‌లో రూ.50,000 పెట్టుబడికి పన్ను మినహాయింపు కల్పించింది. గత ఏడాది ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 90వేల ఖాతాలు ప్రారంభమయ్యాయి. పన్ను ఊరటతో అకౌంట్ల సంఖ్య భారీగా పెరగనుంది.
News February 2, 2025
దేశ అప్పు రూ.181 లక్షల కోట్లు
దేశంపై అప్పుల భారం పదేళ్లలో ఏకంగా 192 శాతం పెరిగింది. 2015 మార్చి 31 నాటికి రూ.62 లక్షల కోట్లు ఉండగా, ఈ ఏడాది మార్చి నెలాఖరుకు రూ.181 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్రం అంచనా వేసింది. ఇందులో విదేశీ రుణం 6.18 లక్షల కోట్లు, అంతర్గత అప్పు రూ.175 లక్షల కోట్లని తెలిపింది. 2026 మార్చి 31కి మొత్తం అప్పు రూ.196 లక్షల కోట్లకు చేరొచ్చని పేర్కొంది.