News June 16, 2024
అనంత: భార్యపై అనుమానంతో కత్తితో భర్త దాడి

అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాడిపత్రిలోని పాతకోటకు చెందిన దాదాపీర్.. అనుమానంతో భార్య రమీజాను అర్ధరాత్రి కత్తితో గొంతు కోశాడు. ఆమెను స్థానికులు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో అనంతపురానికి తీసుకెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వీరికి వివాహం జరిగి కేవలం 5 నెలలు అయినట్లు తెలుస్తోంది.
Similar News
News March 31, 2026
నిబంధనలు పాటించలేదా ఇకపై చర్యలు తప్పవు: ఏఎస్పీ

తాడిపత్రిలో అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు భద్రతే ద్యేయంగా ముందుకు వెళ్తున్నారు. తాడిపత్రి బైపాస్‌లో టౌన్ సీఐ ఆరోహణరావుతో కలిసి నిబంధనలు పాటించని పలు వాహనదారులకు కౌన్సెలింగ్ ఇవ్వడమే కాకుండా.. హెల్మెట్లు ధరించని వాహనదారులకు రూ.1,035 జరిమాన విధించారు. హెల్మెట్లు తప్పకుండా ధరించాలని సూచించారు.
News March 30, 2026
సమాజంలో పేదరికాన్ని నిర్మూలిద్దాం: కలెక్టర్

పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్బంగా.. సోమవారం అనంతపురం జేఎన్టీయూలోని కళాశాల ఆడిటోరియంలో అవగాహన సదస్సుని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ ఆనంద్ పాల్గొని మాట్లాడుతూ.. సమాజంలో పేదరికాన్ని నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ స్వప్న, మార్కెట్ యార్డు ఛైర్ పర్సన్ బల్లా పల్లవి పాల్గొన్నారు.
News March 29, 2026
నేడు ఎల్లనూరు మండలానికి హీరో విజయ్ దేవరకొండ రాక

ఎల్లనూరు మండలంలో నేడు హీరో విజయ్ దేవరకొండ పర్యటించనున్నారు. మండల పరిధిలోని జంగంపల్లి కోట వద్ద ‘రణబలి’ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. అందుకు తగ్గ ఏర్పాట్లను సిద్ధం చేశారు. పుట్లూరు సీఐ సత్యబాబు బందోబస్తు చేపట్టారు.


