News June 16, 2024

నెల్లూరు: ఫాదర్స్ డే స్పెషల్.. PIC OF THE DAY

image

ఫాదర్స్ డేను పురస్కరించుకుని ఒక చిన్నారి కళ్లజోడుపై తల్లిదండ్రుల చిత్రాన్ని గీచారు. సైదాపురం మండలంలోని ఓరుపల్లికి చెందిన రమేశ్ కుమారుడు లోహిత్ గిద్దలూరు హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. బాలుడు చిన్నప్పటి నుంచి చిత్రాలు గీస్తున్నాడు. ఈ క్రమంలో ఫాదర్స్ డే సందర్భంగా కళ్లజోడుపై తల్లిదండ్రుల చిత్రాలను గీశాడు. వాటిని చూసి పలువురు అభినందిస్తున్నారు.

Similar News

News March 30, 2026

నెల్లూరు SP స్ట్రాంగ్ వార్నింగ్

image

IPL సీజన్ మొదలైన నేపథ్యంలో జిల్లా పరిధిలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ గురించి ఎస్పీ డా. అజిత వేజెండ్ల యువతకు కీలక హెచ్చరిక జారీ చేశారు. బెట్టింగ్‌కు బానిసలై కొంత మంది యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్రికెట్ కేవలం వినోదం కోసం చూడాలి అని, బెట్టింగ్ వైపు మొగ్గు చూపితే అది ఊబి లాంటిది అని, ఇంకా వెనక్కి రావడం కష్టం అని అన్నారు.

News March 30, 2026

నెల్లూరు: నేడు CM.. షెడ్యూల్ ఇదే

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో CM చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. ఉదయం 11.30గంటలకు DVసత్రం(M) నెల్లబల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. రోడ్డు మార్గాన పుదూరుకు చేరుకుని టిడ్కో ఇళ్లను ప్రారంభిస్తారు. తర్వాత లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాలు చేస్తారు. మధ్యాహ్నం బిరదవాడ వద్ద TDP నాయకులతో సమావేశం, సాయంత్రం 4.45గంటలకు తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీలో జరిగే P-4 కార్యక్రమానికి హాజరవుతారు.

News March 29, 2026

నెల్లూరు జిల్లాలో విషాదం..

image

మర్రిపాడు మండలం నందవరంలో విషాదం చోటు చేసుకుంది. పాముకాటుకు గురై గోగుల నవనీత్ (5) అనే బాలుడు మృతి చెందాడు. ఇంటి ఆరు బయట ఆడుకుంటున్న ఆ చిన్నారిని పాము కాటు వేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పంచనామా అనంతరం కుటుంబ సభ్యులకు ఆదివారం అప్పగించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.