News June 16, 2024

‘పబ్జీ’ ప్రియుడి కోసం.. యూపీకి అమెరికా యువతి

image

ఆ మధ్య పబ్జీ ప్రియుడి కోసం పాక్ నుంచి భారత్ వచ్చిన సీమా హైదర్ తరహాలోనే మరో ఘటన జరిగింది. USకు చెందిన బ్రూక్లిన్(30)కు, UPలోని ఇటావాకు చెందిన హిమాన్షుతో పబ్జీలో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కొన్నాళ్ల క్రితం చండీగఢ్‌లో కలుసుకొని పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఆమెను ఇటావాకు తీసుకురాగా స్థానికుల సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంగీకారంతోనే అతడిని ఆమె పెళ్లి చేసుకున్నట్లు విచారణలో తేలింది.

Similar News

News January 16, 2025

BREAKING: భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోలు మృతి

image

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. బీజాపూర్, సుకుమా, దంతెవాడ జిల్లాల పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మావోలు ఎదురుపడ్డారు. దీంతో మధ్యాహ్నం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇటీవల మావోలు మందుపాతర పేల్చడంతో ఎనిమిది మంది పోలీసులు చనిపోయిన విషయం తెలిసిందే.

News January 16, 2025

జారిపడ్డ పోప్.. చేతికి గాయం

image

పోప్ ఫ్రాన్సిస్ గాయపడ్డట్లు వాటికన్ సిటీ అధికారులు తెలిపారు. శాంటా మార్టాలోని తన నివాసంలో ఆయన ప్రమాదవశాత్తు జారి పడటంతో మోచేతికి గాయమైనట్లు వెల్లడించారు. అయితే ఎలాంటి బోన్ ఫ్రాక్చర్ కాలేదని, గాయం కావడంతో వైద్యులు కట్టు కట్టినట్లు పేర్కొన్నారు. కాగా గడిచిన రెండు నెలల్లో పోప్ గాయపడటం ఇది రెండోసారి. ఇటీవల ఆయన బెడ్ పైనుంచి కింద పడటంతో దవడకు దెబ్బ తగిలింది.

News January 16, 2025

రేపు ఓటీటీలోకి విడుదల-2?

image

వెట్రిమారన్ డైరెక్షన్‌లో విజయ్ సేతుపతి, సూరి, మంజూ వారియర్ ప్రధానపాత్రల్లో నటించిన విడుదల-2 రేపు ఓటీటీలోకి రానున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. జీ5లో స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొంటున్నాయి. ఓటీటీలో 3 గంటల 44 నిమిషాల నిడివితో మూవీ ఉంటుందని తెలుస్తోంది. డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టలేకపోయినా వెట్రిమారన్ టేకింగ్, సేతుపతి నటన హైలైట్‌గా నిలిచాయి.