News June 16, 2024
వచ్చే నెలలో జీశాట్-ఎన్2 ప్రయోగం!

జీశాట్-ఎన్2 ప్రయోగాన్ని జులై రెండో వారంలో ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. 4,700 కేజీల బరువుండే ఈ ఉపగ్రహాన్ని స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా స్పేస్‌లోకి పంపనున్నారు. దీని జీవితకాలం 14 ఏళ్లు. దేశ బ్రాడ్ బ్యాండ్ కమ్యూనికేషన్ అవసరాల కోసం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ దీనిని రూపొందించింది. అండమాన్ నికోబార్, లక్షద్వీప్ సహా భారత్ మొత్తానికి దీని సేవలు అందనున్నాయి.
Similar News
News January 13, 2026
చలాన్ పడగానే డబ్బు కట్ కావాలా?

చలాన్ పడితే ఆటోమేటిక్‌గా డబ్బు కట్ అయ్యేలా బ్యాంక్ అకౌంట్ <<18838769>>లింక్<<>> చేయాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం వల్ల ట్రాఫిక్ నిబంధనల అమలు కఠినంగా మారుతుందని కొందరు భావిస్తుండగా చలాన్ల ఇష్యూలు మరింత పెరుగుతాయని వాహనదారులు భయపడుతున్నారు. సాంకేతిక లోపాల వల్ల తప్పుడు ఫైన్లు పడితే కట్ అయిన డబ్బును తిరిగి పొందడమూ కష్టమేనంటున్నారు. ఇంతకీ ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి?
News January 13, 2026
చిరంజీవి ‘MSVPG’ మూవీ పైరసీ

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం ఆన్‌లైన్ సైట్లలో ప్రత్యక్షమైంది. మూవీ రిలీజైన 24 గంటల్లోనే పైరసీ కాపీ అందుబాటులోకి వచ్చింది. మరోవైపు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఖుషీగా ఉన్న ఫ్యాన్స్.. పైరసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల కలెక్షన్లపై ప్రభావం పడుతుందని మండిపడుతున్నారు. పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
News January 13, 2026
IPL 2026లో RCBకి కొత్త హోంగ్రౌండ్!

వచ్చే IPL సీజన్ కోసం RCBకి కొత్త హోంగ్రౌండ్స్ ఎంచుకుందన్న వార్తలు వైరలవుతున్నాయి. భద్రతా ప్రమాణాల దృష్ట్యా చిన్నస్వామి స్టేడియంలో RCB మ్యాచులు నిర్వహించేందుకు అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో ఆ జట్టు ఆడాల్సిన 7 హోంగ్రౌండ్ మ్యాచుల్లో 5 DY పాటిల్ స్టేడియం(నవీ ముంబై), 2 రాయ్‌పూర్‌లో ఆడుతుందని తెలుస్తోంది. RCB కప్పు కొట్టిందని చిన్నస్వామిలో నిర్వహించిన కార్యక్రమంలో 11మంది చనిపోయిన విషయం తెలిసిందే.


