News June 16, 2024

ఆంధ్ర ప్రజల రుణం తీర్చుకునే ఛాన్స్ ఇది: మంత్రి నిమ్మల

image

తనకు దక్కిన జలవనరుల శాఖతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునే అవకాశం కలిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వైసీపీ హయాంలో నిర్వీర్యమైన జలవనరుల శాఖకు తిరిగి జవసత్వాలు తెస్తామని, పోలవరం పూర్తికి తొలి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ప్రతి ప్రాజెక్ట్‌లో 40శాతం నిధులను ‘జే’ గ్యాంగ్ కమీషన్ల రూపంలో దోచుకుందని, ప్రాజెక్టుల పేరిట వారు చేసిన అక్రమాలను త్వరలోనే బయటపెడతామని అన్నారు.

Similar News

News March 19, 2026

భీమవరం: దివ్యాంగులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

image

భీమవరం కొత్త బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ‘దివ్యాంగ శక్తి’ పథకం కింద దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే రామాంజనేయులు బుధవారం ప్రారంభించారు. కలెక్టర్ దివ్యాంగులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మానవీయత చాటుతూ వారితో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. ఆమె మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

News March 18, 2026

హిందీ పరీక్షకు 353 మంది గైర్హాజరు: డీఈవో

image

పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఈఓ నారాయణ తెలిపారు. బుధవారం నిర్వహించిన హిందీ పరీక్షకు మొత్తం 22,858 మంది విద్యార్థులకు గాను 22,505 మంది హాజరుకాగా, 353 మంది గైర్హాజరయ్యారని వివరించారు. అలాగే ఓపెన్ స్కూల్ ఆంగ్ల పరీక్షకు 253 మందికి 215 మంది హాజరయ్యారని, 38 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

News March 18, 2026

భీమవరం: ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం

image

భీమవరం ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రారంభించారు. 40 శాతానికి పైగా వైకల్యం ఉన్నవారు ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని వారు వివరించారు. దివ్యాంగులకు సముచిత స్థానం కల్పించాలనే సదుద్దేశంతోనే ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వారు పేర్కొన్నారు.