News June 16, 2024
విశాఖ: పాప్‌కార్న్ కోసం వెళ్లిన చిన్నారి మృతి

పాప్ కార్న్ కొనేందుకు వెళ్లిన చిన్నారి విగతజీవిగా మారింది. కంచరపాలెం జాషువా నగర్‌లో ఉంటున్న బీ.సురేశ్, శృతి దంపతులకు పూజిత (9) ఒక్కగానొక్క కూతురు. దీంతో వారు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అయితే శుక్రవారం రాత్రి పాప్‌కార్న్ కోసం అని తండ్రి బైక్‌పై మార్కెట్‌కు వెళ్తుండాగా జరిగిన ప్రమాదంలో పూజిత మృతిచెందింది. చిన్నారిని తలుచుకుంటూ తల్లిదండ్రులు విలపిస్తున్నారు.
Similar News
News March 13, 2026
విశాఖ: షాపుల ముందు చెత్త వేస్తున్నారా? రూ.5000 జరిమానా తప్పదు!

వార్డుల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. గురువారం 20వ వార్డులో పర్యటించిన ఆయన, రోడ్లపై వ్యర్థాలు వేసిన బ్లింకిట్ అవుట్‌లెట్‌కు రూ.10 వేలు, పాన్ షాపునకు రూ.5 వేల జరిమానా విధించారు. నిబంధనలు ఉల్లంఘించే వాణిజ్య సముదాయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్లాప్ వాహనాలు సమయపాలన పాటించాలని ఆయన స్పష్టం చేశారు
News March 13, 2026
విశాఖ పోలీసులను అభినందించిన సీఎం

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సైబర్ నేరాలపై విశాఖ పోలీసులు రూపొందించిన 24 షార్ట్ ఫిలింలను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. రాష్ట్రంలో సైబర్ మోసాలతో రూ.వేల కోట్ల నష్టం జరుగుతున్న నేపథ్యంలో అవగాహన పెంచేందుకు వీటిని రూపొందించినట్లు విశాఖ సీపీ బాగ్చీ వివరించారు. ఈ కృషికి పోలీసులను సీఎం అభినందించారు.
News March 12, 2026
మధురవాడ: ఉరివేసుకుని యువకుడు మృతి!

మధురవాడ గణేష్ నగర్‌లో తాడి ప్రవీణ్ కుమార్ (27) అనే యువకుడు మనస్థాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చింతపల్లికి చెందిన ప్రవీణ్ గత ఆరేళ్లుగా ఓ మహిళతో సహజీవనం చేస్తూ, స్థానిక టెలిఫోన్ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


