News June 16, 2024
మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం: హోంమంత్రి అనిత
మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. వైసీపీ పాలనలో స్త్రీలకు రక్షణ కరువైందని, రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వాడకం బాగా పెరిగాయన్నారు. భూకబ్జాలు, దాడులకు హద్దులేకుండా పోయిందని ఆరోపించారు. వీటన్నింటినీ తమ ప్రభుత్వంలో సరిదిద్దుతానన్నారు. ఆడపిల్లలు కిడ్నాప్‌కు గురికాకుండా పటిష్ఠమైన చర్యలు చేపడతామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు.
Similar News
News January 27, 2025
విశాఖ కలెక్టర్ బంగ్లాలో హై-టీ వేడుకలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం కలెక్టర్ బంగ్లాలో హై-టీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యరావు, రాజకీయ ప్రముఖులు, నేవీ అధికారులు, పోలీస్ అధికారులు, జిల్లా అధికారులు వేడుకల్లో భాగస్వామ్యం అయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, ఆకట్టుకున్నాయి.
News January 26, 2025
విశాఖలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
విశాఖలోని ఆశీల్‌మెట్టలో యువకుడి మృతదేహం లభ్యమైంది. త్రీ టౌన్ ఎస్‌ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం ఓ స్కూల్ గేట్ ఎదురుగా మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించారని తెలిపారు. మృతుడి వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించినట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని ఎస్‌ఐ సురేష్ కోరారు.
News January 26, 2025
విశాఖ: 28 మంది జిల్లా స్థాయి అధికారులకు పురస్కారాలు
గణతంత్ర దినోత్సవ వేడుకలు విశాఖ పోలీస్ భారక్స్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా నుంచి 446 మందికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అందులో 28 మంది జిల్లా స్థాయి అధికారులకు పురస్కారాలు దక్కాయి. వారిలో VMRDA కమీషనర్ కె.ఎస్.విశ్వనాథన్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ,ఏపీఈపీడీసీఎల్ ఛైర్మన్ ఇమ్మడి పృథ్వీతేజ్, డిప్యూటీ కలెక్టర్లు కె.సంగీత్ మాథుర్, సుధాసాగర్ ఉన్నారు.