News June 16, 2024

బక్రీద్‌కు జంతువధ నిషేధం అర్థరహితం: హైకోర్టు

image

మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో విశాల్‌గఢ్ కోట వద్ద బక్రీద్‌కు జంతువధను ఆ రాష్ట్ర సర్కారు నిషేధించడాన్ని బాంబే హైకోర్టు తప్పుబట్టింది. ఆ నిర్ణయం అర్థరహితమైనదని తేల్చిచెప్పింది. కోట రక్షిత కట్టడాల జాబితాలోకి వస్తుందని ప్రభుత్వం తరఫు లాయర్లు వాదించగా.. మరి ఇన్నేళ్లూ ఏం చేశారంటూ ప్రశ్నించింది. ముస్లింలు బహిరంగంగా కాక.. ప్రైవేటు భూముల్లో యథేచ్ఛగా పండుగ చేసుకోవచ్చని తీర్పునిచ్చింది.

Similar News

News October 7, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 7, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4:55 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:07 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:04 గంటలకు
అసర్: సాయంత్రం 4:21 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:00 గంటలకు
ఇష: రాత్రి 7.12 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 7, 2024

మయాంక్ యాదవ్ అరుదైన ఘనత

image

టీమ్ ఇండియా క్రికెటర్ మయాంక్ యాదవ్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే అరుదైన ఘనత సాధించారు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన తొలి ఓవర్‌ను మెయిడెన్‌గా ముగించారు. దీంతో అరంగేట్ర మ్యాచ్‌లోనే మెయిడెన్ వేసిన మూడో భారత బౌలర్‌గా రికార్డులకెక్కారు. గతంలో 2006లో సౌతాఫ్రికాపై అజిత్ అగార్కర్, 2022లో ఇంగ్లండ్‌పై అర్ష్‌దీప్ సింగ్ ఈ ఫీట్ సాధించారు.

News October 7, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.