News June 16, 2024
ఐస్‌క్రీమ్‌లో జెర్రి

ఇటీవల మహారాష్ట్రలో ఐస్‌క్రీమ్‌లో తెగిపడిన మనిషి వేలు కనిపించిన ఘటన మరవకముందే మరో ఘటన వెలుగుచూసింది. యూపీలోని నోయిడాకు చెందిన దీపాదేవి తన కొడుకు కోసం బ్లింకిట్‌లో అమూల్ ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేశారు. తీరా బాక్స్ ఓపెన్ చేసి చూడగా అందులో జెర్రి కనిపించడంతో షాక్ అయ్యారు. వెంటనే బ్లింకిట్‌కు ఫిర్యాదు చేయగా ఐస్‌క్రీమ్ ధర రూ.195ను ఆమెకు రీఫండ్ చేసింది. విషయాన్ని అమూల్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది.
Similar News
News March 5, 2026
సంజూ దూకుడు.. భారీ స్కోర్ దిశగా భారత్

T20WC: ఇంగ్లండ్‌పై సంజూ శాంసన్ దూకుడుగా ఆడుతున్నారు. ఇషాన్ కిషన్‌తో కలిసి సిక్సర్లు, బౌండరీలతో దుమ్మురేపుతున్నారు. పవర్ ప్లే (6 ఓవర్లు) ముగిసే సరికి భారత్ స్కోర్ 67/1గా ఉంది. అభిషేక్ 9 రన్స్ చేసి ఔటయ్యారు. సంజూ (40*), కిషన్ (16*) క్రీజులో ఉన్నారు. మరి 20 ఓవర్లలో టీమ్ ఇండియా ఎంత స్కోర్ చేస్తుందో కామెంట్ చేయండి.
News March 5, 2026
ఎక్కువ పిల్లల్ని కంటాం సరే.. ప్రభుత్వ సాయం ఏ మూలకు?

దేశంలో 1980-90s వరకు ఎక్కువ మంది పిల్లల్ని కనేందుకు మొగ్గుచూపేవారు. పెరిగిన ఖర్చులు, పేదరికంతో క్రమంగా ఒకరిద్దరు సంతానానికే పరిమితమయ్యారు. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యువతరం కొరత ఉంది. అందువల్ల ఎక్కువ మంది పిల్లలను కంటే ప్రోత్సాహకాలు ఇస్తామని AP CM CBN <<19304777>>ప్రకటించారు.<<>> అయితే విద్య, వైద్యం, కూడు, గూడు, గుడ్డ ఖరీదైన సమాజంలో ఈ సాయం ఏమాత్రం సరిపోతుందనేది అతిపెద్ద ప్రశ్న. మీరేమంటారు?
News March 5, 2026
అభిషేక్ మరోసారి ఫెయిల్

T20WCలో టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి ఫెయిల్ అయ్యారు. కీలకమైన సెమీఫైనల్లో రెండో ఓవర్లోనే భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చారు. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ పైనా నిర్లక్ష్యపు షాట్ ఆడి 9 పరుగులకే ఔట్ కావడంపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఫైనల్‌కు వెళ్తే అతడిని పక్కన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ WCలో అభి 7 మ్యాచులు ఆడి 89 రన్స్ మాత్రమే చేశారు.


