News June 16, 2024

నేత్రావల్కర్‌కు జీతం పెంచాలి.. నెటిజన్ల డిమాండ్

image

ఓవైపు ఒరాకిల్ వంటి సంస్థలో ఉద్యోగం చేస్తూ, అమెరికా తరఫున బౌలర్‌గానూ రాణిస్తున్నారు సౌరభ్ నేత్రావల్కర్. యూఎస్ఏ జట్టు సూపర్-8కు చేరుకోవడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో సౌరభ్‌కు జీతాన్ని పెంచాలంటూ ఒరాకిల్‌ను నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అతడికి పని బరువును తగ్గించాలని కోరుతున్నారు. ముంబైలో పుట్టిన సౌరభ్ 2010లో భారత్ తరఫున అండర్-19 వరల్డ్ కప్ ఆడారు. ఉద్యోగరీత్యా USలో స్థిరపడ్డారు.

Similar News

News September 14, 2025

కౌరవుడే అయినా.. అన్యాయాన్ని ఎదురించాడు!

image

మహాభారతంలో ఎందరికో తెలియని పాత్రలెన్నో ఉన్నాయి. అందులో వికర్ణుడి పాత్ర ఒకటి. ఆయన కౌరవుడే అయినప్పటికీ ద్రౌపది వస్త్రాపహరణం వంటి అధర్మ కార్యాలను వ్యతిరేకించాడు. ధ్రుతరాష్ట్రుడు, ద్రోణుడు, కృపాచార్యుడు వంటి పెద్దలు నిలబడి చోద్యం చూసినా వికర్ణుడు ఊరుకోలేదు. కౌరవ అగ్రజుడైన ధుర్యోదనుడినే ఎదురించాడు. కానీ, రక్త సంబంధానికి కట్టుబడి కురుక్షేత్రంలో కౌరవుల పక్షాన పోరాడాడు. భీముడితో తలపడి వీరమరణం పొందాడు.

News September 14, 2025

IOCLలో 523 అప్రెంటిస్‌లు

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(<>IOCL<<>>) 523 అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చేసినవారు అక్టోబర్ 11వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

News September 14, 2025

వాటర్ క్యాన్ ఎంత కాలం వాడుతున్నారు?

image

వాటర్ క్యాన్‌లను కొందరు నెలలకొద్దీ, మరికొందరు ఏళ్ల పాటు వాడుతుంటారు. ఇది ప్రమాదకరమని, 3 నెలలే వినియోగించాలని వైద్యులు చెబుతున్నారు. అంతకంటే ఎక్కువ రోజులు వాడితే క్యాన్లలో ఆల్కలైన్ ఏర్పడి ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే, TDS 50-150ppm మధ్య ఉండే నీటినే తీసుకోవాలని, ఎక్కువున్న నీటిని తాగితే కీళ్ల నొప్పులు, ఎసిడిటీ, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.