News June 16, 2024

కోహ్లీ పరుగుల ఆకలితో ఉండటం మంచిదే: బ్యాటింగ్ కోచ్

image

టీ20 WCలో విరాట్ కోహ్లీ ఫామ్‌పై ఆందోళన అవసరం లేదని టీమ్‌ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నారు. ‘కోహ్లీ బాగా రాణిస్తున్నారా లేదా అని ప్రతిసారి ప్రశ్నలు తలెత్తుతాయి. ఆయన పరుగులు చేయాలనే ఆకలితో ఉండటం మంచిదే. సూపర్-8 మ్యాచుల్లో కోహ్లీ అగ్రెసివ్‌నెస్ జట్టుకు సహాయపడుతుంది. నెట్స్‌లో ఆయన బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. రన్స్ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు’ అని పేర్కొన్నారు.

Similar News

News March 14, 2026

SIDBIలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

image

లఖ్‌నవూలోని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SIDBI) 3 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, CA, CFA, MBA, PGDM అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 18 వరకు ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.sidbi.in

News March 14, 2026

జనసేన ఆవిర్భావ దినోత్సవం.. చంద్రబాబు శుభాకాంక్షలు

image

AP: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్ర అభివృద్ధిలో, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జనసేన పోషిస్తున్న పాత్ర అభినందనీయం. ప్రజలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్ కోసం పని చేస్తున్న జనసైనికులకు, వీరమహిళలకు, నేతలకు శుభాభినందనలు’ అని ట్వీట్ చేశారు.

News March 14, 2026

కల్తీపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్: మంత్రి

image

AP: పాలు, నెయ్యి, వెన్నలో డిటర్జెంట్, యూరియా, పిండి పదార్థాల వంటి ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కల్తీ పాలు కిడ్నీలు, జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని.. కొనేటప్పుడు FSSAI లోగో, లైసెన్స్ నంబర్ సరిచూసుకోవాలని సూచించారు. ఏదైనా ఫిర్యాదు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1100, 1800 425 3857కు కాల్ చేయాలన్నారు. కల్తీపై అవగాహన పెంచుకోవడం ముఖ్యమని ట్వీట్ చేశారు.